R Narayana Murthy: ఇంటి అద్దె కట్టలేని స్థితిలో విప్లవమూర్తి!

ఆర్ నారాయణమూర్తి అంటే విప్లవ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రజల కోసమే.. ప్రజల సమస్యలే ఆయన కథ.. సమాజంలో రుగ్మతలే ఆయన సినిమాలో కనిపించేది. అసలు సినిమానే ప్రజలను చైతన్య పరిచే సాధనమని ఆయన భావన. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే నేటికీ కట్టుబడి ఉన్నారు. కమర్షియల్ సినిమాలలో కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చినా సున్నితంగా కాదనుకొని ఆయన సిద్ధాంతాలనే ఇప్పటికీ ప్రజల ముందు ఉంచే తత్వం ఆయనది.

R Narayana Murthy: ఇంటి అద్దె కట్టలేని స్థితిలో విప్లవమూర్తి!

R Narayana Murthy

R Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి అంటే విప్లవ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రజల కోసమే.. ప్రజల సమస్యలే ఆయన కథ.. సమాజంలో రుగ్మతలే ఆయన సినిమాలో కనిపించేది. అసలు సినిమానే ప్రజలను చైతన్య పరిచే సాధనమని ఆయన భావన. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే నేటికీ కట్టుబడి ఉన్నారు. కమర్షియల్ సినిమాలలో కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చినా సున్నితంగా కాదనుకొని ఆయన సిద్ధాంతాలనే ఇప్పటికీ ప్రజల ముందు ఉంచే తత్వం ఆయనది.

ఆయన సినిమాలో దర్శక, నిర్మాత, కథానాయకుడు ఆయనే. అందుకే ఆయన కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తుంటారు. తన వృత్తికి అడ్డుగా భావించిన నారాయణమూర్తి పెళ్లి కూడా చేసుకొని సంగతి తెలిసిందే. కాగా నారాయణమూర్తి ఇబ్బందులలో ఉన్నారని ప్రచారం ఉన్న మాట నిజమే కానీ కనీసం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారని మాత్రం ఇప్పుడే బహిర్గతమైంది. ఈ విషయాన్ని నారాయణమూర్తి సమక్షంలోనే ప్రజా గాయకుడు గద్దర్ చెప్పారు.

నారాయణమూర్తి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘రైతన్న’ త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుత ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ కారణంగా రైతులు పడే అవస్థలు ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రజాగాయకుడు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్.. నారాయణమూర్తి జీవితం గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఆస్తి అంటూ ఏదీ లేని నారాయణ మూర్తి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు.

ఇల్లు లేదు.. భార్య లేదు.. సూటూ బూటూ వేసుకోడు.. చివరకు ఒక బైక్ కూడా లేదు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి సినిమాల్లో నటించే నారాయణ మూర్తి.. జీవితంలో మాత్రం నటించడని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని ధారపోసిన నారాయణమూర్తి.. ఇప్పుడు కనీసం ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని, హైదరాబాద్ నగరానికి 50 కిమీ దూరంలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది మిత్రులు ఉన్నా ఆయన రాడని అన్నారు. ఎంచుకున్న మార్గం కోసం చివరి రక్తపు బొట్టను సైతం ధారపోసేందుకు సిద్ధమైన నారాయణమూర్తిని చూస్తే గర్వంగా ఉంటుందని అన్నారు.