మెడికల్ ఏజెన్సీ మాఫియాలా తయారైంది.. ఇండియాలో ఎందుకు 24 గంటలు టైం పడుతుంది?

కరోనా ఎఫెక్ట్‌పై తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న థియేటర్స్ బంద్‌పై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి..

  • Published By: sekhar ,Published On : March 15, 2020 / 05:43 AM IST
మెడికల్ ఏజెన్సీ మాఫియాలా తయారైంది.. ఇండియాలో ఎందుకు 24 గంటలు టైం పడుతుంది?

కరోనా ఎఫెక్ట్‌పై తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న థియేటర్స్ బంద్‌పై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి..

కరోనా వైరస్ గురించి తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తెలిపారు. ‘‘కరోనాపై కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఎంతో మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. త్వరగా కనిపెట్టి ప్రజలకు మేలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కొంత మంది మెడికల్ ఏజన్సీ వాళ్ళు మాఫియాలాగా తయారై 10రూపాయలు దొరికే మాస్క్ 250కి అమ్ముతున్నారు. వైద్యం కోసం హాస్పటల్‌కి వెళ్ళిన వ్యక్తుల దగ్గర కరోనా పేరు చెప్పి దారుణంగా దోచేస్తున్నారు. ప్రజల్ని కరోనా పేరు చెప్పి కొంతమంది వైద్యులు భయపెడుతున్నారు. ఈ వైరస్ నివారించడానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది.

చైనాలో కరోనాని గుర్తించడానికి అమెరికా నుంచి స్క్రీనింగ్ యంత్రాలు దిగుమతి చేసుకున్నారు. అవి 15నిమిషాల్లో గుర్తిస్తున్నాయి. కానీ మన ఇండియాలో ఎందుకు 24గంటలు టైం పడుతుంది. మోడీ గారు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి ఆ స్క్రీనింగ్ యాంత్రాలను మనం కూడా దిగుమతి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు భయాందోళనకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు.