R Narayana Murthy: నేను చాలా రిచ్ ఫెలోని.. చాలా హ్యాపీగా బ్రతుకుతున్నా!

ఆర్ నారాయణమూర్తి అంటే విప్లవ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రజల కోసమే.. ప్రజల సమస్యలే ఆయన కథ.. సమాజంలో రుగ్మతలే ఆయన సినిమాలో కనిపించేది. అసలు సినిమానే ప్రజలను చైతన్య పరిచే సాధనమని ఆయన భావన. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే నేటికీ కట్టుబడి ఉన్నారు.

R Narayana Murthy: నేను చాలా రిచ్ ఫెలోని.. చాలా హ్యాపీగా బ్రతుకుతున్నా!

R Narayana Murthy (1) (1)

R Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి అంటే విప్లవ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రజల కోసమే.. ప్రజల సమస్యలే ఆయన కథ.. సమాజంలో రుగ్మతలే ఆయన సినిమాలో కనిపించేది. అసలు సినిమానే ప్రజలను చైతన్య పరిచే సాధనమని ఆయన భావన. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే నేటికీ కట్టుబడి ఉన్నారు. కమర్షియల్ సినిమాలలో కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చినా సున్నితంగా కాదనుకొని ఆయన సిద్ధాంతాలనే ఇప్పటికీ ప్రజల ముందు ఉంచే తత్వం ఆయనది.

ఆయన సినిమాలో దర్శక, నిర్మాత, కథానాయకుడు ఆయనే. అందుకే ఆయన కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తుంటారు. అయితే, కనీసం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారని ఈ మధ్యనే నారాయణమూర్తి సమక్షంలోనే ప్రజా గాయకుడు గద్దర్ చెప్పారు. నారాయణమూర్తి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘రైతన్న’ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన గద్దర్ నారాయణమూర్తి జీవితం గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణమూర్తి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నాననే వార్తల్లో నిజం లేదని.. స్వేచ్ఛగా ఉంటుందనే నగర శివార్లలో ఉంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమాల జీవితం.. ప్రజా జీవితమేనన్న మూర్తి.. హైస్కూలులో ఉన్నప్పుడు చాప మీదే పడుకున్నాను. సూపర్ హిట్ సినిమాలు తీసినప్పుడు కూడా చాప మీదే పడుకున్నాను. నేను ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను.. ఇప్పటికీ నేను చాలా రిచ్ ఫెలోనని చెప్పారు.

తాను అడిగితే సహాయం చేసే స్నేహితులు.. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారని.. అయితే తనకి ఆ అవసరం రాలేదన్నారు. రైతన్న సినిమా కార్యక్రమంలో గద్దర్ నా మీద ప్రేమతో అభిమానంతో అలా మాట్లాడారని.. అప్పుడే దానిపై వివరణ ఇచ్చానని చెప్పారు. నేను స్వేచ్ఛగా జీవించడానికి ఇలా సిటీకి దూరంగా ఉన్నానని చెప్పిన ఆయన ఆటోలో ప్రయాణించడానికే తనకు రోజుకు వెయ్యి రూపాయలు అవుతుందని.. ఆ రకంగా ఆటోకే నెలకు 30 వేలు ఖర్చు పెడుతున్న ధనవంతుడినని చెప్పారు.