‘రాహు’ రివ్యూ

సస్పెన్స్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాహు’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : February 28, 2020 / 10:13 AM IST
‘రాహు’ రివ్యూ

సస్పెన్స్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాహు’ రివ్యూ..

టాలీవుడ్‌లో థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే కొత్తవారితో ‘రాహు’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందింది. విడుదలకు ముందే ట్రైలర్, పాటలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ‘రాహు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కన్వర్షన్ డిజార్డర్ నేపథ్యంగా నూతన దర్శకుడు సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాహు’ ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. 

కథ : 
రాహు కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అమ్మాయి రాహు లాంటి శక్తుల నుంచి తనను తాను ఎలా రక్షించుకుందనేది ఈ చిత్ర కథ. భాను ఆరేళ్ల వయస్సు నుంచే కన్వర్షన్ డిజార్డర్‌తో బాధపడుతుంటుంది. రక్తం చూస్తే తనకు కళ్లు కనిపించవు. నాగరాజు అనే క్రిమినల్‌ను పట్టుకునేందుకు భాను తండ్రి భార్గవ్ జరిపిన ఆపరేషన్‌లో భానుకు ఈ జబ్బు వస్తుంది. అయినా భానులో పోరాడే శక్తినిస్తూ పెంచి పెద్ద చేస్తాడు. 

అయితే తన జాతకం ప్రకారం భానుకు రాహు దోషం ఉంటుంది. పెళ్లైతే 30 రోజుల్లో చనిపోతుందని జ్యోతిష్యుడు చెబుతాడు. అప్పటికే ఆమె శేషుతో ప్రేమలో ఉంటుంది. తనను జైలుకు పంపించిన భార్గవ్ కుమార్తె భానును చంపేందుకు నాగరాజు జైలు నుంచి పారిపోతాడు. ఈ క్రమంలో భాను కిడ్నాప్‌కు గురై నాగరాజు ఉండే నివాసానికి చేరుకుంటుంది. శేషు కూడా భానును అన్వేషిస్తూ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భాను ప్రాణాలతో ఎలా భయటపడింది? శేషు, నాగరాజులో రాహు ఎవరనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు : 
హీరో అభిరామ్ వర్మ కటౌట్ చూడడానికి బావుంది. యాక్టింగ్ పర్వాలేదు అనిపించాడు. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం సీన్స్‌లో ఉన్న ఎఫెక్టివ్ నెస్‌ని తన నటన ద్వారా ఎలివేట్ చెయ్యలేకపోయాడు. హీరోయిన్ కృతి గర్గ్ మాత్రం తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. పేరుకి హీరోయిన్ అయినా కూడా ఈ సినిమాకి హీరోగా మారింది కృతి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో రొమాంటిక్ సీన్స్‌లో సైతం మెప్పించింది. ఈ సినిమా తర్వాత కృతికి మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్ , స్వప్నిక లాంటివాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ అయ్యింది.

టెక్నీషియన్స్ :
చాలా రోజులుగా వర్క్ చేసి, చివరకి తాను అనుకున్నవిధంగా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ సుబ్బు వేదుల. అక్కడక్కడా వేరే సినిమాల నుంచి ప్రేరణ పొందినట్టు కనిపించినా కూడా ఓవరాల్‌గా ఒక ఫ్రెష్ థ్రిల్లర్‌ని అందించాలని సిన్సియర్‌గా ట్రై చేసాడు అని అర్ధమవుతుంది. కానీ రాసుకున్న సీన్స్‌ని అంతే ఎఫెక్టివ్‌గా తెరకెక్కించలేదు అనేది కూడా ఒప్పుకోవాలి.

సినిమాటోగ్రాఫర్స్ సురేష్ రగుతు, ఈశ్వర్ లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాకి పెద్ద సినిమా కలరింగ్ తేవడానికి ప్రయత్నించారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఒక మోస్తరుగా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమో ఏమో’ సాంగ్ సినిమాకి పెద్ద ఎస్సెట్. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే.. ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రస్టింగ్‌గా లేకపోయినా.. సెకండ్ హాప్ సినిమాలో మార్కులు కొట్టేసింది ‘రాహు’.. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. 

See Also | ‘హిట్’ రివ్యూ