ఉత్కంఠ భరితంగా ‘రాహు’ ట్రైలర్

అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ‘రాహు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

10TV Telugu News

అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ‘రాహు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్.. ‘రాహు’.. సుబ్బు వేదుల దర్శకత్వంలో.. శ్రీ శక్తి స్వరూప్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై.. ఏవీఆర్ స్వామి, రాజా దేవరకొండ, శ్రీ శక్తి బాబ్జీ, సుబ్బు వేదుల కలిసి నిర్మిస్తున్నారు. గిరి, స్వప్నిక, కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్, చలాకీ చంటి కీలక పాత్రలు చేశారు.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ‘రాంగ్ టైమ్, రాంగ్ ప్లేస్, రాంగ్ గర్ల్’ అంటూ.. అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్న కథానాయిక.. ‘రాహు’ బారినుండ ఎలా తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

Read Also : వైరల్ అవుతున్న బన్నీ కిడ్స్ క్యూట్ పిక్

ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. త్వరలో ‘రాహు’ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : ప్రవీణ్ లక్కరాజు, లిరిక్స్ : శ్రీనివాస మౌళి, సుబ్బు వేదుల, కెమెరా : సురేష్ రగుతు, ఈశ్వర్, ఎడిటింగ్ : అమర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాసరావు బేతపూడి.
 

    ×