Racism : నిన్న నెపోటిజం.. ఇవాళ రేసిజం.. ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రతిభావంతులు చాలా కారణాల వల్ల ఎదగట్లేదు. నెపోటిజంతో పాటు రేసిజం కూడా ఒక కారణం. ఈ రేసిజం వల్ల ప్రతిభ ఉన్న నటీ నటులని రంగు, పొడవు, లావు ఇలా

Racism : నిన్న నెపోటిజం.. ఇవాళ రేసిజం.. ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు

Navaj (1)

Racism :  టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లో నెపొటిజం ఉంది. ఒక ఫ్యామిలీ నుంచే చాలా మంది పరిశ్రమకి రావడం, వాళ్ళకే సపోర్ట్ చేయడం, వాళ్లే ఇండస్ట్రీని నడిపించడం, వాళ్ళ ఫ్యామిలీ కాని వాళ్ళని సినీ పరిశ్రమలో ఎదగకుండా చేయడం.. ఇవన్నీ నెపోటిజం కిందకే వస్తాయి. నెపోటిజం ఎప్పట్నుంచో ఉన్నా గత సంవత్సరం బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పుడు ఒక్కసారిగా బయటకి వచ్చింది. నెపోటిజం వల్లే అతను చనిపోయాడని, ఇంకా ఎంతో మంది తొక్కేయబడ్డారని కొంతమంది సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. నెపొటిజంపై పోరాటం చేసేందుకు కంగనా రనౌత్ లాంటి కొంతమంది స్టార్లు ముందుకొచ్చి తీవ్రంగా వ్యతిరేకించారు. నెపొటిజం వల్ల ఎంతో మంది ప్రతిభావంతులు అయిన నటీ నటులు ఇండస్ట్రీలో కనీసం గుర్తింపు కూడా తెచ్చుకోలేక పోతున్నారు, నెపొటిజంతో ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్ కు అవకాశాలు ఉండట్లేదు అనే వాదన ఉంది.

MAA Elections 2021 : ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై కౌంటర్లు వేసిన ‘మా’ ఎన్నికల అధికారి

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రతిభావంతులు చాలా కారణాల వల్ల ఎదగట్లేదు. నెపోటిజంతో పాటు రేసిజం కూడా ఒక కారణం. ఈ రేసిజం వల్ల ప్రతిభ ఉన్న నటీ నటులని రంగు, పొడవు, లావు ఇలా ముఖం, శరీరాల్ని చూసి కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. రేసిజం ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నదే కాని ఇప్పుడు తెరపైకి వచ్చింది. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ రేసిజంపై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన నటించిన ‘సీరియస్ మ్యాన్’ అనే సినిమాలో హీరోయిన్ గా ఇందిరా తివారీ నటించింది. సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాని ఆమె లుక్ పరంగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు ముందు ముందు ఆఫర్లు వస్తాయనే నమ్మకం కూడా లేదు అని సినీ ప్రముఖులే అంటున్నారట.

Bunny Vasu : ఇండస్ట్రీలో కూడా తప్పులున్నాయి : బన్నీ వాసు

ఈ విషయంపై నవాజుద్దీన్ సీరియస్ అయి స్పందించారు. నవాజుద్దీన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బాలీవుడ్ లో రేసిజం వల్ల ఎంతో మంది ప్రతిభా వంతులు కనుమరుగు అవుతున్నారు. నల్లగా, పొట్టిగా ఉన్నారు అంటూ చాలా మందిని పక్కకు పెడుతున్నారు. ట్యాలెంట్ ను చూసి ఆఫర్లు ఇవ్వాల్సిన వారు రంగు, హైట్ ను చూసి ఇస్తున్నారు. అందరికీ ఏదో ఒక పాత్ర ఉంటుంది వారికి తగ్గ పాత్రలు కూడా వారికి ఉంటాయి కానీ వాటికి కూడా వాళ్ళని సెలెక్ట్ చెయ్యట్లేదు. ఇండస్ట్రీలో రేసిజం వల్ల అందంగా లేని వారికి ఆఫర్లు రావడం లేదని, ముఖ్యంగా ఈ వివక్ష ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుందని బాధపడుతూ తీవ్రంగా స్పందించారు.