Radhe Shyam : ‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ సీన్ లీక్..!

‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ క్లైమాక్స్‌లో ఏం జరగబోతోంది..?

Radhe Shyam : ‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ సీన్ లీక్..!

Radhe Shyam

Radhe Shyam: ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా స్టార్టయిన దగ్గరనుంచే న్యూస్ మేకర్ అయ్యింది. మూడేళ్ల నుంచి తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ క్లైమాక్స్‌లో ఏం జరగబోతోంది..?

రెండున్నరేళ్లుగా తెరకెక్కుతున్న ప్రభాస్ ప్రేమకథ ఓ కొలిక్కొచ్చింది. లాక్‌డౌన్ బ్రేక్ వేసినా.. ఎలా గొలా షూటింగ్ లాస్ట్ స్టేజ్‌కి తెప్పించారు మేకర్స్. పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రేమ కావ్యం ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ ఫినిషింగ్ టచెస్ చేసుకుంటోంది. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

సలీమ్-అనార్కలీ, దేవదాస్-పార్వతి.. అంతటి గొప్ప ప్రేమికుల తర్వాత ‘రాధే శ్యామ్’ అంటూ సినిమా మీద సూపర్ క్రేజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ లిస్ట్‌లో ప్రేమికుల లవ్ స్టోరీ చివరి వరకూ సంతోషంగా లేరు.. సో.. ‘రాధే శ్యామ్’ లో కూడా ప్రభాస్, పూజా లవ్ స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్ కాదని, క్లైమాక్స్‌లో పూజా హెగ్డే చనిపోతుందంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

‘రాధే శ్యామ్’ 70 లోని రోమ్ బ్యాక్ డ్రాప్‌లోని రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతోంది. యాక్షన్ నుంచి బ్రేక్ తీసుకుని విక్రమాదిత్యగా ‘రాధే శ్యామ్’ లో క్యూట్‌గా కనిపించబోతున్నారు ప్రభాస్. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు మేకర్స్. ఇటలీ, జార్జియాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా మొత్తం కంప్లీట్ అయిన ‘రాధే శ్యామ్’ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.