Prabhas : ‘ఇన్నాళ్లూ ఈ రొమాన్స్ మిస్ అయిపోయాం డార్లింగ్’..

కొంత గ్యాప్ తర్వాత ‘రాధే శ్యామ్’ లో లవర్ బాయ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు..

Prabhas : ‘ఇన్నాళ్లూ ఈ రొమాన్స్ మిస్ అయిపోయాం డార్లింగ్’..

Mirchi Movie

Prabhas: డార్లింగ్ ప్రభాస్‌ని లవర్ బాయ్ క్యారెక్టర్‌లో చూసి చాలా రోజులైపోతుంది. ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’ సెకండ్ సినిమా ‘రాఘవేంద్రం’, తర్వాత ‘వర్షం’, ‘అడవిరాముడు’ ‘పౌర్ణమి’, ‘డార్లింగ్’ ఇలా పలు సినిమాల్లో ప్రేమికుడి పాత్రల్లో అలరించాడు ప్రభాస్. ‘మిర్చి’ తర్వాత రొమాన్స్‌కి దూరమైపోయాడు.

Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల్లో లవ్ సీన్లకు, రొమాన్స్‌కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ తనను ఎలాంటి క్యారెక్టర్‌లో చూడాలనుకుంటున్నారో అలాంటి లవర్ బాయ్ రోల్ చేస్తున్నాడు ‘రాధే శ్యామ్’ మూవీలో. రీసెంట్‌గా రిలీజ్ చేసిన లవ్ ఆంథమ్ ప్రోమోలో పూజా హెగ్డేతో డార్లింగ్ కెమిస్ట్రీ, రొమాన్స్ సింప్లీ సూపర్బ్.

Radhe Shyam : ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ భలే ఉందిగా..

ఏదైనా ఓ సినిమాకి సంబంధించి అప్‌డేట్ వచ్చిందంటే సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ కామెంట్స్ ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే. ఇప్పుడలాంటి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ హల్‌చల్ చేస్తోంది. ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమోలో ప్రభాస్, పూజా కాలి వేళ్లను, పాదాన్ని తాకుతూ ఉంటాడు. అలాగు ‘మిర్చి’ లో ‘కాటుక కళ్లను చూస్తే’ పాటలో అనుష్క కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుంటాడు. ఈ రెండు పిక్స్‌ని కంపేర్ చేస్తూ.. ‘ఇన్నాళ్లూ ఈ రొమాన్స్ మిస్ అయిపోయాం డార్లింగ్’ అంటూ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mirchi Radhe Shyam