Radhe Shyam: సాంగ్ వచ్చేసింది.. ‘నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే’!

ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తనలోని రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే రాధేశ్యామ్ సినిమా. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నుండి రాబోతున్న తొలి సినిమా కూడా..

Radhe Shyam: సాంగ్ వచ్చేసింది.. ‘నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే’!

Radhe Shyam

Radhe Shyam: ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తనలోని రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే రాధేశ్యామ్ సినిమా. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నుండి రాబోతున్న తొలి సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమా మీద అంచనాలకు హద్దే లేకుండా పోతుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటలీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథ ఇది.

Acharya: మెగా హీరోల కోసం యంగ్ టైగర్ రాక..!

విక్రమాదిత్యగా ప్రభాస్‌ ప్రత్యేకమైన పాత్రలో సందడి చేయనుండగా.. తనని ఓ సరికొత్త లుక్‌లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ నుండి ఇదే విషయాన్ని నిరూపిస్తూ వచ్చారు మేకర్స్. జ‌న‌వ‌రి 14న సినిమాను విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ సినిమాకి సంబంధించిన రెండో పాట‌ హిందీ వెర్షన్‌ ను నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ‘ఆషికీ ఆ గయి’ అంటూ ప్రభాస్‌-పూజాల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది.

Mahesh Babu : మహేష్‌బాబుకు సర్జరీ.. షూటింగ్స్‌కి బ్రేక్.. ఆందోళనలో అభిమానులు

కాగా.. ఈరోజు నగుమోము తారలే అంటూ సాగే తెలుగు వ‌ర్షెన్ విడుదల చేశారు. మనసుని హత్తుకునేలా సాగిన ఈ పాటలో భావం మరికాస్త సినీ ప్రియులను ఫిదా చేసేయగా.. ఇందులో చెప్పే డైలాగ్స్ కూడా హృదయాన్ని తాకేలా చేశారు. పూజ ప్రభాస్ ను నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అంటే.. చా నేనా టైపు కాదని అంటాడు. దానికి పూజ.. కానీ నేను జూలియట్ నే.. నాతో ప్రేమలో పడితే ఛస్తావ్ అనే డైలాగ్ ఇంటెన్స్ గా సినిమా కథను తెలిపేలా సాగడం.. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేది చూపించిన మేకర్స్ చివర్లో పల్స్ బీట్ సౌండ్ ఇంటెన్స్ గా కథకు లింక్ చేసినట్లుగా కనిపించింది.