Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడప్.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

మొన్నటి వరకూ స్లోగా.. అసలు చేయ్యాల వద్దా అన్నట్టు.. కామ్ గా ఉన్న రాధేశ్యామ్ టీమ్ రిలీజ్ డేట్ దగ్గర పడటం.. ఫ్యాన్స్ బాగా ట్రోల్స్ చేయడంతో.. ప్రమోషన్స్ స్పీడప్ చేశారు.

Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడప్.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

Prabhas Radheshyam

Radhe Shyam: మొన్నటి వరకూ స్లోగా.. అసలు చేయ్యాల వద్దా అన్నట్టు.. కామ్ గా ఉన్న రాధేశ్యామ్ టీమ్ రిలీజ్ డేట్ దగ్గర పడటం.. ఫ్యాన్స్ బాగా ట్రోల్స్ చేయడంతో.. ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. వరుసగా సాంగ్స్ ను రిలీజ్ చేసేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లు ఇచ్చేస్తున్నారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా రాధేశ్యామ్. మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్నఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా.. ఈమధ్య వరకూ సినిమా ప్రమోషన్స్ విషయంలో టీమ్ స్లోమోషన్ లోనే ఉంది.

Manasanamaha: ఆస్కార్‌కు నామినేటైన తొలి తెలుగు షార్ట్ ఫిల్మ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?

ఇప్పుడుప్పుడు స్పీడ్ గా అప్ డేట్స్ ఇస్తున్న టీమ్.. వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్. ఆ మధ్య సూసైడ్ చేస్కుంటానని ఓ ఫాన్ సోషల్ మీడియాలో పెడితే .. రాధేశ్యామ్ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు యూనిట్. అయితే అక్కడితో ఆగకుండా.. రాదేశ్యామ్ ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది టీమ్. ఈ మధ్యనే రాదేశ్యామ్ నుంచి ఈ రాతలే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ టీమ్ తో లైవ్ సెషన్ కూడా పెట్టింది టీమ్. రాధేశ్యామ్ అప్ డేట్స్ విషయంలో విపరీతంగా నెగెటివిటీని సొంతం చేసుకున్న మూవీ క్రియేషన్స్ ఇప్పటికైనా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడంతో ఫాన్స్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు.

Raai Laxmi: బాబోయ్.. ఏంటీ రచ్చ రత్తాలు!

ఇప్పటికీ రాదేశ్యామ్ నుంచి రెండు సాంగ్స్ ను ఆల్ రెడీ రిలీజ్ చేశారు టీమ్. రెండు టీజర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కాని రిలీజ్ అయిన సాంగ్ లో కూడా ఎక్కడా.. ప్రభాస్, పూజాహగ్డే డైరెక్ట్ అప్పియరెన్స్ లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు ఫాన్స్. అంతే కాదు.. స్పెషల్ టీజర్లు కూడా అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో.. ఆహైప్ కంటిన్యూ చెయ్యడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు యూనిట్. అందుకే వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 8న మూడో సింగిల్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికైనా మేకర్స్ మేల్కొన్నందకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Pushpa: ఫుల్ స్పీడ్ ప్రమోషన్లు.. పుష్ప ఫీవర్ తెగపెంచేస్తున్న సుక్కు!