Radhe Shyam Teaser: రాధేశ్యామ్ టీజర్.. అంతర్లీనంగా కథను చెప్పిన మేకర్స్!

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే గురించే. ఈ బర్త్ డే సందర్భంగానే రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. హాలీవుడ్ సినిమాలకు..

10TV Telugu News

Radhe Shyam Teaser: గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే గురించే. ఈ బర్త్ డే సందర్భంగానే రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా విడుదల చేసిన రాధేశ్యామ్ టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. గత కొన్ని నెలల నుంచి రాధేశ్యామ్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడగా.. వాళ్ళ ఎదురుచూపులు ఫలించేలా టీజర్ లో చూపిన ప్రతిభ.. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాయి.

Uppena 2: ఉప్పెనకి సీక్వెల్.. పాన్ వరల్డ్ కథంటున్న బుచ్చిబాబు

ముఖ్యంగా ప్రభాస్ స్టయిల్, అద్భుతమైన విజువల్స్ తో పాటు ‘నేను దేవుడిని కాదు.. మీలో ఒకడిని కూడా కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ చూస్తుంటే ఈ సినిమాలో ఏదో ఒక అంతులేని కథ దాగిఉన్నట్లుగా అర్ధమవుతుంది. కానీ.. టీజర్ లో పట్టి పట్టి చూస్తే.. టీజర్ ద్వారా మేకర్స్ చెప్పాలనుకున్నది ఏంటన్నది అర్ధం చేసుకోగలిగితే ఈ సినిమా అసలు కథ ఏంటి.. కాన్సెప్ట్ ఏంటన్నది అర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్ ద్వారానే మేకర్స్ రాధేశ్యామ్ కథను అంతర్లీనంగా చెప్పుకొచ్చారు.

Rashmika: రష్మికకి కోపమొస్తే ఇలా చూపిస్తుందా..? వీడియో వైరల్!

సినిమాలో ప్రభాస్ పేరు విక్రమాదిత్య కాగా చేతి రేఖలు చూసి జాతకాలు చెప్పడం అతడి వృత్తి. అలా అని సింపుల్ గా చెప్పలేదు.. అతడి ప్రతిభ ఏంటనేది టీజ‌ర్‌లో చెప్పేందుకు.. ఇండియాలో ఎమర్జెన్సీ వస్తుందని ముందే ఊహించిన వ్యక్తిగా విక్రమాదిత్యను చూపిస్తూ.. ‘ద మ్యాన్ హూ ప్రెడిక్టడ్ ఇండియన్ ఎమర్జెన్సీ’ అంటూ అతడిపై ఓ పుస్తకం రాసినట్టు చూపించారు. గతంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రభాస్, పూజ హెగ్డే స్టిల్ ఒకటి రిలీజ్ చేయగా అందులో పియానో కనిపించగా.. ఇప్పుడు టీజర్ లో ఇంటిలో కూడా పియానో చూపించారు. దీనిని బట్టి చూస్తే ఈ ఇళ్లే వాళ్ళ ప్రేమకి పునాది.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

ఇక ఈ టీజర్ లో పూజ హెగ్డేను ఎక్కడా చూపించలేదు కానీ ఆమె స్పర్శని చూపించారు. పూజా చేతిని ప్రభాస్ పట్టుకోవడం చూపించారు. ఇక, ప్రభాస్ పేరు విక్రమాదిత్య కాగా పూజా పాత్ర పేరు ప్రేరణ.. అందుకే ఒకచోట ‘VA+P’ అని పేర్లు చెక్కారు. ఇంతకు ముందే విడుదల చేసిన స్టిల్స్ లో ఒక దానిలో టన్నెల్ లోంచి ఒక ట్రయిన్ వస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు టీజర్ లో ఓ కిటికీలో నుండి తీసిన షాట్ లో అదే టన్నెల్ లోంచి ఒక ట్రయిన్ వస్తున్నట్లుగా చూపించారు. దీనిని బట్టి ఇది పునర్జన్మల కథగా ఊహించుకోవచ్చు.

Anushka on Prabhas: ప్రభాస్ బర్త్ డే.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క..!

గతంలో ఫస్ట్ లుక్ లో ప్రభాస్, పూజల చుట్టూ నీరు ఉన్నట్లు చూపించగా.. ఇప్పుడు టీజర్ లో కూడా సముద్రాన్ని చూపించారు. దీనిని బట్టి ఇందులో సముద్రం కూడా కీలకమే. టీజర్ చూసినంత సేపు టేబుల్ క్లాక్, రైల్వే క్లాక్ కనిపించడంతో ఇందులో టైమ్ కూడా కీరోల్ ప్లే చేస్తున్నట్టు ఉంది. ఇవి మాత్రమే కాదు.. గులాబీ నీటిలో పడడం.. లైట్ హౌస్ కూలడం.. ఫైట్ సీన్ లో ప్రభాస్ చేతికి కారుతున్న రక్తపు బొట్టు ఓ బొమ్మపై పడడం.. టీజర్ మొదలు.. టీజర్ చివర ఒకే బొమ్మను చూపించడం ఇలా అంతర్లీనంగా ఓ కథ రన్ అవుతూనే ఉంది. మొత్తంగా చూస్తే.. రాధేశ్యామ్ సాంకేతికంగానే కాకుండా.. కథాపరంగా కూడా తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.