Aashiqui Aa Gayi: ‘రాధేశ్యామ్’ నుంచి సాంగ్ వచ్చేసింది..

ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Aashiqui Aa Gayi: ‘రాధేశ్యామ్’ నుంచి సాంగ్ వచ్చేసింది..

Prabhas

Aashiqui Aa Gayi: ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

అయితే, తెలుగు సాంగ్ కాదు హిందీ సాంగ్.. ప్రభాస్​, పూజా హెగ్డే ఎంతో స్టైలిష్‌గా.. అందంగా ఈ పాటలో కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ప్రతి ఫ్రేమ్ అందంగా వచ్చిందని చెబుతున్నారు.

ఈ పాటను మిథున్ ట్యూన్ చేశాడు. ‘ఆషికీ ఆగయీ’ అంటూ అర్జీత్ సింగ్ పాడిన ఈ పాట ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి, మురళీశర్మ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు.