Radhe Shyam: ప్రభాస్ “రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

రీసెంట్ వరుస అప్ డేట్ లతో బిజీ అయిన టాలీవుడ్ కు కొత్త స్టైల్ ఇచ్చారు సినిమా టీం. యానిమేటెడ్ గా వచ్చిన వీడియోకు లిరిక్స్ యాడ్ చేసి అభిమానులకు అద్భుతాన్ని అందించారు.

Radhe Shyam: ప్రభాస్ “రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Radhe Syam

Radhe Syam: కొన్నేళ్ల గ్యాప్ తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్‌లో వస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. వరుస అప్ డేట్ లతో బిజీ అయిన టాలీవుడ్ కు కొత్త స్టైల్ ఇచ్చారు సినిమా టీం. యానిమేటెడ్  వీడియోకు లిరిక్స్ యాడ్ చేసి అభిమానులకు అద్భుతాన్ని అందించారు.

సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. గొప్ప ప్రేమ‌క‌థ అని మోష‌న్ పోస్ట‌ర్ తోనే రివీల్ అయ్యింది. మొన్న విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యంకాని రికార్డుల్ని రాధే శ్యామ్ తిరగరాసింది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు.

వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. తాజాగా ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఎవరో వీరెవరో’ అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తోంది. యానిమేషన్ తో నిండిన ఈ పాట చూస్తున్నా.. వింటున్నా ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం.

……………………………… : రాధేశ్యామ్ సీక్వెల్ రానుందా?

ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ Pokutti వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

……………………………..: స్టార్స్ లేరు.. సందడి చేస్తున్న చిన్న సినిమాలు!

ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..
వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే..
ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా పదే పదే..
కలవడం ఎలా ఎలా.. రాసే ఉందా రాసే ఉందా..

ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..

ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..

ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో.. నాతో ఏదో కథ చెప్పాలంటుందే..
ఏ గూఢాచారో.. గాఢంగా నన్నే..
వెంటాడెను ఎందుకో ఏమో..
కాలం మంచు కప్పి గుండెల్లో గుచ్చే..
గాయం లేదు కానీ దాడెంతో నచ్చే..
ఆ మాయా ఎవరే.. రాదా ఎదురే.. తెలియకనే తహతహ పెరిగే..
నిజమో భ్రమో.. బాగుంది యాతనే..
కలతో కలో.. గడవని గురుతులే..
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..

ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..