Radheshyam : ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా.. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేనట్టే

కొన్ని రోజులుగా 'రాధేశ్యామ్' వాయిదా తప్పదు అంటూ వార్తలు వచ్చినా సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాని కొద్దీ క్షణాల క్రితమే.....

Radheshyam : ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా.. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేనట్టే

Radheshyam

Radheshyam :   కరోనా, ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో దేశంలో ఇప్పటికే కొన్ని చోట్ల లాక్ డౌన్ ప్రకటించారు. మరి కొన్ని చోట్ల కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. అందులోను పెద్ద సినిమాలు రిలీజ్ చేయలేరు. మరో పక్క ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయం ఇంకా పరిష్కారం కాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా సంక్రాంతికి అనౌన్స్ చేసిన ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ని కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

కొన్ని రోజులుగా ‘రాధేశ్యామ్’ వాయిదా తప్పదు అంటూ వార్తలు వచ్చినా సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాని కొద్దీ క్షణాల క్రితమే ‘రాధేశ్యామ్’ని కూడా వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవ్వాలి. కాని కరోనా కారణంగా, పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా ప్రభుత్వ ఆంక్షలని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే మళ్ళీ మరో రిలీజ్ డేట్ తో మీ ముందుకి వస్తాము అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Mahesh Babu : ‘పుష్ప’ సినిమాపై మహేష్‌బాబు రివ్యూ

దీంతో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వట్లేదు. ఇదే ఛాన్స్ అనుకోని చిన్న సినిమాలన్నీ వరుస పెట్టి సంక్రాంతికి తమ రిలీజ్ లని అనౌన్స్ చేశాయి. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.