Radhe shyam Teaser : నాకు అన్ని తెలుసు.. కానీ నేను దేవుడ్ని కాదు.. విడుదలయిన రాధేశ్యామ్ టీజర్

ఈ టీజర్ చాలా కొత్తగా ఉంది. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడిగా కనబడబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ మొత్తం ప్రభాస్ నే చూపించారు. టీజర్ అంతా ప్రభాస్ వాయిస్ ఓవర్ తో

10TV Telugu News

Radhe shyam Teaser :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ‘సాహో’ తర్వాత ఇప్పటిదాకా సినిమా రాలేదు. కానీ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమాల అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. కానీ ఆ సినిమా నుంచి ఇప్పటిదాకా పోస్టర్లు తప్ప ఏ అప్డేట్ లేదు. ఇటీవల ‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ బర్త్ డే రోజున టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈ సినిమా టీజర్ ని ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.

Sree leela : మాస్ హీరోకి జోడిగా ‘పెళ్లి సందడి’ హీరోయిన్

ఈ టీజర్ చాలా కొత్తగా ఉంది. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడిగా కనబడబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ మొత్తం ప్రభాస్ నే చూపించారు. టీజర్ అంతా ప్రభాస్ వాయిస్ ఓవర్ తో సాగింది. “నువ్వెవరో నాకు తెలుసు కానీ చెప్పను. నీ ప్రేమ విఫలమవడం నేను ఫీల్ అవ్వగలను కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు కానీ చెప్పను. నీ చావు కూడా నాకు తెలుసు కానీ చెప్పను. నాకు అన్ని తెలుసు అయినా నీకు చెప్పను ఎందుకంటే అవి నీ ఆలోచనలకి అందవు. నా పేరు విక్రమాదిత్య నేను దేవుడ్ని కాదు. కాని మీలో ఒకడ్ని కూడా కాదు” అంటూ వాయిస్ ఓవర్ తో టీజర్ సాగింది. టీజర్ విజువల్స్ చాల కొత్తగా ఉన్నాయి. ప్రేమతో పాటు థ్రిల్లర్ అంశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. జనవరి 14న సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవ్వబోతుంది అని మరోసారి తెలిపారు. ‘రాధేశ్యామ్’ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.