Radheshyam : స్టార్ హీరోల రికార్డులని బద్దలు కొట్టిన ‘రాధేశ్యామ్’ టీజర్

స్టార్ హీరోల సినిమాల టీజర్లు యూట్యూబ్ లో ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ ని సంపాదిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఉన్న ఆ రికార్డులని ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్ తో 24 గంటలు గడవకముందే బద్దలు

Radheshyam : స్టార్ హీరోల రికార్డులని బద్దలు కొట్టిన ‘రాధేశ్యామ్’ టీజర్

Radheshyam

Radheshyam :  ఒక్కప్పుడు రికార్డులంటే సినిమా ఎన్ని రోజులు ఆడింది అని చూసే వారు. కాని తర్వాత రికార్డుల అర్ధమే మారిపోయింది. ఎక్కువ రోజులు పోయి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కలెక్షన్స్ కూడా పోయి డిజిటల్ రికార్డులు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల టీజర్లు, ట్రైలర్లు ఎంత ఎక్కువ మంది చూస్తే అదే రికార్డు. ఇప్పుడు అభిమానులంతా ఈ రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాల టీజర్లు యూట్యూబ్ లో ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ ని సంపాదిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఉన్న ఆ రికార్డులని ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ తో 24 గంటలు గడవకముందే బద్దలు కొట్టేశాడు.

Serials : ఇకపై సీరియల్స్ లో కౌగిలింతలు, సన్నిహిత దృశ్యాలు బంద్

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారి వారి పాట’ సినిమా టీజర్ ఇప్పటి దాక అత్యధికంగా ఒక్క రోజులో 23 మిలియన్ వ్యూస్ సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఒక్క రోజులో 22 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇటీవల కాలంలో ఈ రెండే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించాయి. తాజాగా నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ టీజర్ ట్రేండింగ్ లోకి వెళ్ళింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే పాత రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా 24 గంటలు గడవకముందే ఒక్క యూట్యూబ్ ఛానల్ లోనే 39 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. ఇక దరిదాపుల్లో కూడా ఏ స్టార్ హీరో లేడు, రాలేడు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. ఇక 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ ఈజీ గా దాటేస్తుందని, ఇప్పట్లో ఏ హీరో కూడా ఈ రికార్డుని బద్దలు కొట్టలేరని అభిమానులు అంటున్నారు.