Prabhas : ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్.. రాధే శ్యామ్ టీజర్.. విక్రమాదిత్య ఎవరు??

ఈ నెల 23 న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజైన తన సినిమాల నుంచి అప్డేట్ ఏమైనా వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇవాళ 'రాధేశ్యామ్' సినిమా నిర్మాతలు

10TV Telugu News

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ‘సాహో’ తర్వాత ఇప్పటిదాకా సినిమా రాలేదు. కానీ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అన్ని పాన్ ఇండియా సినిమాలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమాల అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. కానీ ఆ సినిమా నుంచి ఇప్పటిదాకా పోస్టర్లు తప్ప ఏ అప్డేట్ లేదు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. ఇవి కాక నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ k’, ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ తో ‘స్పిరిట్’ సినిమాలు అనౌన్స్ చేశాడు. ఇవి కాకుండా మరో బాలీవుడ్ డైరెక్టర్ తో కూడా సినిమా ఓకే చేశాడు.

Kajal Agarwal : నిర్మాతగా కాజల్.. కొత్త హీరోతో ప్రయోగం..

ఈ నెల 23 న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజైన తన సినిమాల నుంచి అప్డేట్ ఏమైనా వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇవాళ ‘రాధేశ్యామ్’ సినిమా నిర్మాతలు అభిమానులకి శుభవార్త చెప్పారు. ప్రభాస్ నెక్స్ట్ సినిమా ‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ బర్త్ డే రోజున టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై విక్రమాదిత్య ఎవరు? అని రాసి ఉంది. టీజర్ ని 23న ఉదయం 11గంటల 16నిమిషాలకి విడుదల చేస్తామని ప్రకటించారు. అంతే కాక మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ప్రభాస్ బర్త్ డేకి ఇదొక్కటేనా వేరే సినిమాల నుంచి ఇంకేమన్నా అప్డేట్ లు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.