Jai Bhim: చలించిపోయిన లారెన్స్.. రియల్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని హామీ!

తమిళ హీరో నటించి ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఒక సినిమా కాదు.. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన..

Jai Bhim: చలించిపోయిన లారెన్స్.. రియల్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని హామీ!

Jai Bhim

Jai Bhim: తమిళ హీరో నటించి ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఒక సినిమా కాదు.. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన దీన విజయగాధ. ఈ సినిమా చూసిన ప్రముఖులు సైతం దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jai Bheem : ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్రలో ఒదిగిపోయిన నటి ఎవరో తెలుసా?

తాజాగా ఈ సినిమాపై స్పందించిన నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడు జ్ఞానవేల్ ను అభినందించాడు. దర్శకుడు జ్ఞానవేల్ ను మనసారా అభినందిస్తున్నట్టు ట్వీట్ చేసిన లారెన్స్.. ఈ సినిమా కథ వాస్తవ జీవితంలో చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని లారెన్స్ పేర్కొన్నాడు.

Jai Bheem : ‘జై భీమ్’ సినిమా కథ అసలు హీరో ఈయనే

రాజకన్ను భార్య పార్వతమ్మకి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చిన లారెన్స్.. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పాడు. లారెన్స్ గతంలో కూడా పలు సామజిక కార్యక్రమాలను కొనసాగిస్తుండగా.. పలు వృధాశ్రమాలు, పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. కాగా, ఇప్పుడు సినతల్లి విషయంలో లారెన్స్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.