Puneeth Rajkumar : పునీత్ పేరుని గుండెలపై టాటూగా.. మరో రెండు పేర్లు ఎవరివో తెలుసా?
రాఘవేంద్ర రాజ్ కుమార్.. తమ్ముడు మీద ప్రేమతో పునీత్ ముద్దు పేరు 'అప్పు'ని గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే ఆ పేరుతో పాటు మరో రెండు పేరులు కూడా టాటూ వేసుకున్నారు. అవి ఎవరివో తెలుసా?

Raghavendra Rajkumar tattooed puneeth nickname appu on his heart
Puneeth Rajkumar Tatoo : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడాది పైనే అవుతున్న అయన పేరు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది. నటుడు గానే కాదు ఒక మనిషిగా.. మానవత్వంతో ఎంతో మందికి చేసిన సహాయం పునీత్ పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. పునీత్ ని అభిమానించే వ్యక్తిలే అతన్ని మర్చిపోలేక ఏదో విధంగా తలుచుకుంటూనే ఉంటుంటే.. మరి పునీత్ కుటుంబ సభ్యులు ఎలా మర్చిపోగలరు. రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పునీత్ కుటుంబంలో చిన్న కొడుకు.
APSFL : కొత్త మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఇంటిలోనే చూసేలా ఏపీ ప్రభుత్వం కొత్త పథకం..
పునీత్ కి ముందు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), రాఘవేంద్ర రాజ్ కుమార్ (Raghavendra Rajkumar) ఉన్నారు. పునీత్ చిన్నవాడు కావడంతో ఈ ఇద్దరు అన్నయ్యలు తనని ఒక బిడ్డల చూసేవారు. అలాంటి పునీత్ చనిపోవడం వారిద్దరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో కూడా పునీత్ వీడియో చూసి శివరాజ్ కుమార్ కన్నీరుమున్నీరు అయ్యారు. రాఘవేంద్ర కూడా పునీత్ ఫోటో చూసిన దుఃఖం ఆపుకోలేకపోతున్నారు.
Hint Movie : మైత్రి మూవీ క్రియేషన్స్ ‘హింట్’ మూవీ పోస్టర్ లాంచ్.. హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్!
తాజాగా రాఘవేంద్ర.. తమ్ముడు మీద ప్రేమతో పునీత్ ముద్దు పేరు ‘అప్పు’ని గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే ఆ పేరుతో పాటు మరో రెండు పేరులు కూడా టాటూ వేసుకున్నారు. ఆ రెండు పేర్లు టోటో, నుక్కి. అవి పునీత్ ఇద్దరి కూతుళ్ళ ముద్దు పేర్లు. వారి అసలు వందిత, ధృతి. తమ్ముడితో పాటు అతని కూతుళ్ళ పై కూడా ఇంతటి ప్రేమని చూపిస్తున్న రాఘవేంద్రను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ
— Sagar Manasu (@SagarManasu) May 28, 2023