Raghavendra Rao : రాఘవేంద్రరావు BA అంటే అర్ధం తెలుసా??.. ఈయన వల్ల టబుకి చాలా గాయం అయింది..

రాఘవేంద్రరావు అంటే పూలు, పండ్లు, సాంగ్స్, హీరోయిన్ బొడ్డు మీద పళ్ళు వేయడం లాంటివాటికి స్పెషల్ అని అందరికి తెలిసిందే. దీని గురించి కూడా మాట్లాడారు. అల్లు అరవింద్.. రాఘవేంద్రరావు BA అంటే...............

Raghavendra Rao : రాఘవేంద్రరావు BA అంటే అర్ధం తెలుసా??.. ఈయన వల్ల టబుకి చాలా గాయం అయింది..

Raghavendra Rao :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.

ఇక రాఘవేంద్రరావు అంటే పూలు, పండ్లు, సాంగ్స్, హీరోయిన్ బొడ్డు మీద పళ్ళు వేయడం లాంటివాటికి స్పెషల్ అని అందరికి తెలిసిందే. దీని గురించి కూడా మాట్లాడారు. అల్లు అరవింద్.. రాఘవేంద్రరావు BA అంటే బొడ్డు మీద యాపిల్ అని అర్ధం అని అన్నారు. రాఘవేంద్రరావు.. న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు, నేను అది ఎక్కడ పడాలో కనిపెట్టాను అన్నారు. ఇక బాలయ్య పూలు, పండ్లు ఇలాంటివి అన్ని హీరోయిన్స్ కేనా అని అడిగితే రాఘవేంద్రరావు.. మీకు ఇంట్రడక్షన్ సీన్స్, ఫైట్స్, ఎలివేషన్స్ ఉన్నాయి. కానీ హీరోయిన్ ని గెలిస్తేనే హీరో అవుతారు. సగం మంది హీరోయిన్స్ కోసం కూడా సినిమాకి వస్తారు. వాళ్ళకి ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అన్నారు.

Unstoppable 2 : యువ హీరోలపై అగ్ర నిర్మాతల ఆసక్తికర కామెంట్స్.. షోలోనే ఓ హీరోకు ఛాన్స్ ఇచ్చిన అరవింద్..

అల్లు అరవింద్ రాఘవేంద్రరావు గారి కూలి నం.1 సినిమా గురించి చెప్తూ.. ఆ సినిమాలో టబు పొట్ట మీద నుంచి అయితే ఏకంగా బాతులని కూడా పంపించారు. నేను బాతులు గీరేస్తాయి, కొరుకుతాయి కదా అని అంటే డబ్బులు తీసుకుంటున్నారుగా భరిస్తారు అన్నారు. అన్నట్టే పాపం టబు పొట్ట మొత్తం గీరేసింది బాతు అని చెప్పారు.