Raghavendra Rao : చిన్నప్పుడే బన్నీ వాళ్ళ అమ్మకి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి హీరోని చేస్తా అని చెప్పాను

వెంకటేష్ ని, అల్లు అర్జున్ ని రాఘవేంద్రరావే సినీ పరిశ్రమకి పరిచయం చేశారు. వాళ్ళని ఈ దర్శకేంద్రుడే లాంచ్ చేశారు. సురేష్ బాబు, అల్లు అరవింద్ షోలో ఉండటంతో దీని గురించి బాలకృష్ణ ప్రస్తావించగా రాఘవేంద్రరావు ఓ ఆసక్తికర విషయాన్ని...............

Raghavendra Rao : చిన్నప్పుడే బన్నీ వాళ్ళ అమ్మకి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి హీరోని చేస్తా అని చెప్పాను

Raghavendra Rao :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో అనేక సినిమాల గురించి, సినిమా విషయాల గురించి మాట్లాడారు. వెంకటేష్ ని, అల్లు అర్జున్ ని రాఘవేంద్రరావే సినీ పరిశ్రమకి పరిచయం చేశారు. వాళ్ళని ఈ దర్శకేంద్రుడే లాంచ్ చేశారు. సురేష్ బాబు, అల్లు అరవింద్ షోలో ఉండటంతో దీని గురించి బాలకృష్ణ ప్రస్తావించగా రాఘవేంద్రరావు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.

Also Read……………. Raghavendra Rao : రాఘవేంద్రరావు BA అంటే అర్ధం తెలుసా??.. ఈయన వల్ల టబుకి చాలా గాయం అయింది..

రాఘవేంద్ర రావు.. అల్లు అర్జున్ చిన్నప్పుడు చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి వెళ్తే అక్కడ డ్యాన్సులు వేసేవాడు. బన్నీ అప్పుడే చాలా బాగా డ్యాన్సులు వేసేవాడు. ఓ సారి అలాగే చిరంజీవి బర్త్ డేలో బన్నీ డ్యాన్స్ చూసి వాళ్ళ అమ్మ నిర్మలకి జేబులోంచి 100 రూపాయలు తీసి ఇచ్చి మీ అబ్బాయిని నేను హీరో చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత నేను మర్చిపోయినా నిర్మల నాకు గుర్తు చేసింది. అప్పుడు బన్నీని హీరోగా లాంచ్ చేశాను అని అన్నారు. అల్లు అరవింద్ దాని గురించి మాట్లాడుతూ ఆ 100 రూపాయల నోటు నిర్మల ఇప్పటికి దాచుకుంది అని చెప్పింది.