రాగిణి జైలుకు, సంజన CCB కస్టడీకి

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 08:05 AM IST
రాగిణి జైలుకు, సంజన CCB కస్టడీకి

Ragini, Sanjana : సినిమా రంగంలో డ్రగ్స్ ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వినియోగం, విక్రయించారనే ఆరోపణలపై అరెస్టుయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టులో షాక్ తగిలింది. తనకు హెల్త్ బాగా లేదని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చేందుకు అనుమతినివ్వాలని రాగిణి అభ్యర్థించింది.



దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. పరప్పన అగ్రహారం జైలులో ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేసుకోవచ్చని రాగిణికి కోర్టు సూచించింది. ఈ కేసులో కస్టడీ ముగియడంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. మరో నటి సంజనా గల్రానీని కూడా ఉన్నారు.
https://10tv.in/sandalwood-drugs-rocket-ragini-dwivedi-mixes-water-in-urine-sample-during-drug-test/
రాగిణికి జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. కోర్టు ఆదేశాలతో రాగిణి ఈనెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. సంజనాను సీసీబీ కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాగిణిని 12 రోజులు, సంజనను 7 రోజుల పాటు సీసీబీ అధికారులు విచారించారు.



సంజనను మరో ఐదు రోజుల విచారణకు అనుమతి కోరగా..న్యాయస్థానం మూడు రోజుల విచారణకు అనుమతినిచ్చింది. ఇక ఈ కేసులో అరెస్టయిన రవి శంకర్, వీరెన్ ఖన్నాలను ఇంకా విచారించాల్సి ఉంది. మరో మూడు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగించింది.