Rashmika Mandanna : ఆ విషయంలో నా ట్రైనర్ నన్ను టార్చర్ చేస్తాడు

రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. కుల్దీప్ తన ట్రైనింగ్ సెషన్‌లో వర్కవుట్లు సరిగ్గా చేయమంటూ నన్ను టార్చర్ పెడతాడని, వద్దన్నా చేయిస్తూ ఉంటాడని తెలిపింది. ఇలా.......

Rashmika Mandanna : ఆ విషయంలో నా ట్రైనర్ నన్ను టార్చర్ చేస్తాడు

Rashmika

Rashmika Mandanna :   ప్రస్తుతం రష్మిక మంచి ఫామ్ లో ఉంది. వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో దేశం మొత్తం పాపులర్ అయిపొయింది. ‘సామి సామి…’ సాంగ్ లో వేసిన స్టెప్పులతో సోషల్ మీడియాలో దేశాలు దాటి మరీ పాపులర్ అయింది. అందరూ ఆ సాంగ్ కి రష్మిక వేసిన స్టెప్పులను వేసి రీల్స్ చేస్తున్నారు. తాజాగా రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతీ కూడా సామీ సామీ సాంగ్ కి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Ajay Devagan : శబరిమలలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్

ఈ వీడియో చూసి రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. కుల్దీప్ తన ట్రైనింగ్ సెషన్‌లో వర్కవుట్లు సరిగ్గా చేయమంటూ నన్ను టార్చర్ పెడతాడని, వద్దన్నా చేయిస్తూ ఉంటాడని తెలిపింది. ఇలా సామి సామి సాంగ్ కి స్టెప్పులు వేస్తాడని తెలిస్తే దగ్గరుండి నేనే ఆ స్టెప్పులు నేర్పిస్తూ మళ్ళీ మళ్ళీ చేయమని రివేంజ్ తీసుకుంటాను అని పోస్ట్ చేసింది. మొత్తానికి రష్మిక మాత్రం జిమ్ లో బాగా కష్టపడుతుందని అర్ధం అవుతుంది.