Rahul – Ashu: రాహుల్ మాటలకు అషూ రెడ్డి ఎమోషనల్

అషూరెడ్డి... ప‌వ‌న్‌క‌ల్యాణ్ వీరాభిమానిగా హాట్ కామెంట్స్‌తో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఒకవేళ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఇష్ట‌మైతే..

Rahul – Ashu: రాహుల్ మాటలకు అషూ రెడ్డి ఎమోషనల్

Rahul – Ashu

Rahul – Ashu: అషూరెడ్డి… ప‌వ‌న్‌క‌ల్యాణ్ వీరాభిమానిగా హాట్ కామెంట్స్‌తో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఒకవేళ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఇష్ట‌మైతే నాలుగో భార్య‌గా ఉండ‌డానికి సిద్ధ‌ంగా ఉన్నానని ప్ర‌క‌టించి.. ఆ త‌ర్వాత భారీ ట్రోల్స్‌కు గురైంది. తాజాగా మ‌రోసారి ఆమె సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌ ఏడ్పించాడ‌ని అషూరెడ్డి రాసుకొచ్చారు. ఊహించ‌ని విధంగా హౌజ్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత అషూరెడ్డితో రాహుల్‌కు సాన్నిహిత్యం పెరిగింది. అషూను ఎత్తుకుని గాలిలో తిప్పుతూ రాహుల్ దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో నడుస్తుందంటూ సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రిగింది.

తాజాగా మ‌రోసారి వాళ్లిద్ద‌రి రిలేషన్‌షిప్‌పై చ‌ర్చ‌కు తెర‌తీశారు. ఓ ఇంట‌ర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ అషూరెడ్డి త‌న‌కెలా ప్ర‌త్యేక‌మో చెప్పుకొచ్చాడు. అషూ చూపించే కేరింగ్ త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్నాడు. అందుకే అషూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చి చెప్పాడు. ఒక సంద‌ర్భంలో ఎంతో అవ‌స‌ర‌మై రూ.10 వేలు అడిగితే, అషూ ఒక్క క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా పంపింద‌ని చెప్పుకొచ్చాడు.

ఈ ఇంటర్వ్యూ చూసిన అషూ చాలా భావోద్వేగానికి లోన‌య్యారు. థ్యాంక్యూ రాహుల్‌.. నాకు ఏడుపొస్తోంది. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్‌”.. అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. అషూను రాహుల్ ఏడ్పించాడంటూ నెటిజ‌న్లు స‌ర‌దా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.