వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్

  • Published By: chvmurthy ,Published On : December 29, 2019 / 01:21 PM IST
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశాడు.  బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరిగినా…. వారిద్దరు ఆవార్తలను ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు.
rahul punarnavi

తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్‌, పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఆ ఫోటోలు వీడియో రాహుల్ ఇనస్టాగ్రాంలో  పోస్టు చేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రానికి దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాహుల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల  ప్రకాశ్‌రాజ్‌.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్‌, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు.

rahul ramya krishna

అయితే ఈ పార్టీలో రాహుల్‌.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. అని పాట పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు.  ఆ వీడియోను, ఫొటోలను రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Memorable Evening!? @awm_band Thank you so much for being so wonderful. We really enjoyed?

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on