Rahul Sipligunj : ఆస్కార్ తరువాత హైదరాబాద్ చేరుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఎన్టీఆర్ అండ్ చరణ్ పై కామెంట్స్!

ఆస్కార్ వేడుకలు ముగియడంతో RRR టీం ఒక్కొకరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. కాగా..

Rahul Sipligunj : ఆస్కార్ తరువాత హైదరాబాద్ చేరుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఎన్టీఆర్ అండ్ చరణ్ పై కామెంట్స్!

Rahul Sipligunj reached hyderabad and his comments on ntr ram charan

Rahul Sipligunj : రాజమౌళి తెరకెక్కించిన RRR ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకోవడమే కాదు, ఆ సినిమా కోసం పని చేసిన నటులు మరియు సాంకేతిక నిపుణులకు కూడా ఎంతో పేరుని సంపాదించి పెట్టింది. అసలు మన తెలుగు సినిమాకి నేషనల్ లెవెల్ లోనే గుర్తింపు లేని స్టేజి నుంచి నేడు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అందుకొనే స్థాయి వరకు చేరుకుంది. ఆస్కార్ వేడుకలకు ఒక అతిథిగా హాజరైన చాలు అనుకుంటారు ప్రపంచంలోని సినిమా స్టార్స్ అంతా. అలాంటిది హైదరాబాద్ లోని ఒక గల్లీలో పుట్టి ఆస్కార్ స్టేజి పై పెర్ఫార్మ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.

Rahul Sipligunj : బార్బర్ షాప్ నుంచి ఆస్కార్ వేదిక వరకు ప్రయాణం..

ఆస్కార్ వేడుకలు ముగియడంతో RRR టీం ఒక్కొకరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. కాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో రాహుల్ కూడా నటించాడు. ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి వచ్చిన రాహుల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే 10 టీవీతో తన ఆస్కార్ అనుభవాన్ని పంచుకున్నాడు.

Rahul Sipligunj : నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. అంతర్జాతీయ స్టేజిపై నా పేరు చెప్పడం గర్వంగా ఉంది..

“ప్రతి ఆర్టిస్ట్ కి ఆస్కార్ స్టేజి ఎక్కడం అనేది ఒక డ్రీమ్. అది నాకు కీరవాణి గారు, రాజమౌళి గారు వల్ల నెరవేరింది. ఇక్కడ హైదరాబాద్ గల్లీలో పుట్టి ఆస్కార్ స్టేజి పై పర్ఫార్మెన్స్ ఇస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. పాట పడిన తరువాత ఆస్కార్ వేడుకలో ఉన్నవారు అంతా నిలబడి చప్పట్లు కొట్టారు. అంతకుమించి ఆనందం ఇంకేమి ఉంటుంది. ఆస్కార్ చూసి మా అమ్మ చాలా ఎమోషనల్ అయ్యింది. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అని అనుకోలేదు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను అక్కడ” అంటూ వెల్లడించాడు.