Raj Kahani : విడుదలకు రెడీ అంటున్న “రాజ్ కహాని”..

భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలు గా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం "రాజ్ కహాని". ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా............

Raj Kahani : విడుదలకు రెడీ అంటున్న “రాజ్ కహాని”..

Raj Kahani movie ready to release

Raj Kahani :  భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలు గా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం “రాజ్ కహాని”. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పలు పర్యాటక ప్రాంతాలలో ఈ సినిమా తెరకెక్కించగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకం వ్యక్తపరుస్తున్నాను అన్నారు.

Pooja Hegde: పూజా ఫిక్స్ అయ్యింది.. మహేష్ అండ్ కో కోసమే వెయిటింగ్!

నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు గార్లు మాట్లాడుతూ.. మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేసాము. తొందరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. యూత్ ని, ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు.