Raj Kundra : నా అనుమతి లేకుండా…అశ్లీల చిత్రాలు రిలీజ్ చేశాడు, రాజ్ కుంద్రాపై మరో నటి ఫిర్యాదు ?

రాజ్ కుంద్రా వల్ల ఇబ్బందులు పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా...ఓ నటి పోలీసులకు ఫిర్యాదులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుమతి తీసుకోకుండానే...తన అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్స్ లో రాజ్ కుంద్రా విడుదల చేశారని నటి ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Raj Kundra : నా అనుమతి లేకుండా…అశ్లీల చిత్రాలు రిలీజ్ చేశాడు, రాజ్ కుంద్రాపై మరో నటి ఫిర్యాదు ?

Rajkundra

Raj Kundra P*rn Scandal : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాకు చిక్కులు వీడడం లేదు. అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్ ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే..రాజ్ కుంద్రా వల్ల ఇబ్బందులు పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా…ఓ నటి పోలీసులకు ఫిర్యాదులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుమతి తీసుకోకుండానే…తన అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్స్ లో రాజ్ కుంద్రా విడుదల చేశారని నటి ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Read More : Kia Carnival : కార్నివాల్ కారుపై బంపర్ క్యాష్ డిస్కౌంట్ ప్రకటించిన కియా..

ఇటీవలే మల్వాణీ పీఎస్ లో కుంద్రాపై ఫిర్యాదు చేసిన ఈ నటి నుంచి ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా…ఆ నటి తీవ్రమైన ఆరోపణలు చేశారనే టాక్ వినిపిస్తోంది. తాను ఓ అశ్లీల చిత్రంలో నటించినట్లు..నటించిన సమయంలో పలు షరతులు పెట్టడం జరిగిందని తెలిపినట్లు సమాచారం. ప్రైవేటు పార్ట్స్ ను వీడియోలు చూపించకూడదు…అనే షరతుతో రాజ్ కుంద్రా నిర్మించిన అశ్లీల చిత్రంలో నటించినట్లు..ఇందుకు తనకు కొంత మొత్తాన్ని చెల్లించాడని పోలీసుల ఎదుట తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే..తన అనుమతి తీసుకోకుండానే…ఏ విధమైన మార్పులు చేయకుండా..పూర్తి వీడియోను హాట్ షాట్స్ లో విడుదల చేశారని..ఈ విషయం తన స్నేహితుడి ద్వారా తెలిసిందని ఆమె వివరించినట్లు తెలుస్తోంది. మరి…ఈ నటి చేసిన ఆరోపణలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.