Aha Naa Pellanta: రాజ్ తరుణ్ డిజిటల్ ఎంట్రీ.. శివాత్మిక జంటగా వెబ్ సిరీస్!

చాలాకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న యువనటుడు రాజ్ తరుణ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. తన లాగే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ జంటగా వెబ్ సిరీస్..

Aha Naa Pellanta: రాజ్ తరుణ్ డిజిటల్ ఎంట్రీ.. శివాత్మిక జంటగా వెబ్ సిరీస్!

Aha Naa Pellanta

Aha Naa Pellanta: చాలాకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న యువనటుడు రాజ్ తరుణ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. తన లాగే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ జంటగా వెబ్ సిరీస్ ప్రారంభించాడు. కామెడీ రొమాన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’ మొదలు పెట్టింది. ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పేటలెక్కిన వ్యక్తికి తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడనేది కథాంశం.

Raj Tarun : ‘స్టాండ‌ప్ రాహుల్‌.. కూర్చుంది చాలు’..

జీ5, తమడ మీడియా వారి భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాజ్‌తరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్నారు. ‘ఏబీసీడీ’కి దర్శకత్వం వహించిన సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాహుల్‌ తమడ, సాయిదీప్‌రెడ్డి బుర్రలు నిర్మాతలు. ఈ ‘అహ నా పెళ్ళంట’ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోని గరిమొళ్ల సత్యనారాయణ (ట్రైనింగ్‌ కాలేజ్‌)లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, చందన నాగేశ్వరావ్‌, కందుల దుర్గేష్‌, ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్‌, జీ5 నుంచి పూర్ణ ప్రజ్ఞ, రాధకృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Raj Tharun: ఆడియెన్స్‌ను సీట్లలో కూర్చోబెట్టలేకపోయిన స్టాండప్ రాహుల్

కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ ప్రసారం కానుండగా.. పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి.. తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించని ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి-అబ్బాయిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది వెబ్ సిరీస్ లో చూడాలని మేకర్స్ చెప్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ అయినా రాజ్ తరుణ్, శివాత్మికలకు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.