Rajamouli: జపాన్ చెక్కేస్తున్న జక్కన్న.. హ్యాట్రిక్ హిట్ ఖాయమేనా..?

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Rajamouli: జపాన్ చెక్కేస్తున్న జక్కన్న.. హ్యాట్రిక్ హిట్ ఖాయమేనా..?

Rajamoluli To Fly To Japay For RRR Movie Release

Rajamouli: స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను హీరోలుగా పెట్టి, ఓ పీరియాడిక్ ఫిక్షన్ కథను ఆయన తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో చరణ్, తారక్‌ల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.

RRR For Oscars: సెప్టెంబర్ 30న ‘ఆర్ఆర్ఆర్’కు అగ్నిపరీక్ష..?

అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక, గ్లోబల్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. వారు ఇదొక మాస్టర్‌పీస్ అంటూ కితాబివ్వడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

RRR: గెట్ రెడీ జపాన్.. ఆర్ఆర్ఆర్ వచ్చేస్తోంది!

కాగా, ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేసేందుకు రాజమౌళి స్వయంగా జపాన వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఆయన గత చిత్రాలు బాహుబలి, బాహుబలి-2 జపాన్ వాసులకు పిచ్చపిచ్చగా నచ్చడంతో అక్కడ ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తుందని జక్కన్న అండ్ టీమ్ ఆశిస్తున్నారు. ఇక తన సినిమాలను ఆదరిస్తున్న జపాన్ ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు తాను జపాన్ వస్తున్నట్లుగా రాజమౌళి తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. మరి ఆర్ఆర్ఆర్ చిత్రంతో జక్కన్న జపాన్ దేశంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.