Rajamouli : హృతిక్ రోషన్ గురించి నేను మాట్లాడింది తప్పే.. రాజమౌళి!

టాలీవుడ్ జక్కన రాజమౌళి చెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచదేశాల్లో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకు పోతుంది. కాగా గతంలో రాజమౌళి.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి వైరల్ కామెంట్స్ చేశాడు. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాజమౌళి స్పందించాడు.

Rajamouli : హృతిక్ రోషన్ గురించి నేను మాట్లాడింది తప్పే.. రాజమౌళి!

rajamouli, hrithik roshan

Rajamouli : టాలీవుడ్ జక్కన రాజమౌళి చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచదేశాల్లో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకు పోతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టిస్టార్రర్ చిత్రం హాలీవుడ్ ఆడియన్స్ అండ్ టెక్నిషన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా జపాన్, చైనా దేశాల్లో భారీ రీచ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. ఇక ఇటీవల ఆస్కార్ ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో ఈ సినిమా ప్రదర్శన జరగగా.. కేవలం 98 సెకండ్స్ లో అన్ని టికెట్ లు అమ్మడు పోయి రికార్డు సృష్టించింది.

Rajamouli : RRR బాలీవుడ్ సినిమా కాదు, తెలుగు సినిమా.. అమెరికాలో గర్వంగా చెప్పిన రాజమౌళి..

కాగా గతంలో రాజమౌళి.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి వైరల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే.. ప్రభాస్ ‘బిల్లా’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పని చేయడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాజమౌళి స్పందించాడు.

’15 సంవత్సరాలు క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో నాకు అర్ధం కావడం లేదు. అయితే హృతిక్ రోషన్ ని అవమానించడం నా ఉద్దేశం కాదు. హృతిక్ ధూమ్-2 సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తీసే హీరోలు మన ఇండస్ట్రీలో లేరా అనుకున్న సమయంలో.. బిల్లా ట్రైలర్ చూశాను. నాకు ధూమ్-2 రేంజ్ లో బిల్లా ట్రైలర్ అనిపించడంతో ఆ వ్యాఖ్యలు చేశాను. అయితే నేను మాట్లాడిన విధానం తప్పు. అది నేను అగీకరిస్తున్నాను’ అంటూ తన తప్పుని ఒప్పుకున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లి కూడా, ఇంకా తన తప్పుని అంగీకరించి క్షమాపనులు చెప్పిన రాజమౌళికి నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.