Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ షో లో రాజమౌళి – రాఘవేంద్ర రావు..!

ఇద్దరు సెలబ్రెటీలు, గురు శిష్యులు, దర్శక దిగ్గజాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారు..

Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ షో లో రాజమౌళి – రాఘవేంద్ర రావు..!

Emk Show

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో తో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తారక్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ బుల్లితెర విషయానికొస్తే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. టీవీ షో తో ప్రేక్షకుల ఇళ్లల్లోకే వెళ్లాలి.

Gautham : హ్యాపీ బర్త్‌డే లిటిల్ ప్రిన్స్..

ఇంతకుముందు ‘బిగ్ బాస్’ తో ఎలాగైతే అందర్నీ ఆకట్టుకున్నారో ఇప్పుడు కూడా అలాగే కంటెస్టెంట్లతో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. వాళ్లల్లోని భయాన్ని పోగొడుతూ ‘ఆట నాది కోటి మీది’ అంటూ వారి చేత సరాదాగా ఆట ఆడిస్తున్నారు తారక్. ఇటీవల ప్రారంభమైన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు.

Jr NTR : హైదరాబాద్ శివార్లలో భారీగా భూమి కొన్న జూనియర్ ఎన్టీఆర్!

ఇప్పుడు మరో ఇద్దరు సెలబ్రెటీలు, గురు శిష్యులు, దర్శక దిగ్గజాలు ఈ షో లో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, దర్శక ధీరుడు రాజమౌళి.. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో కనిపించనున్నారు. రీసెంట్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ స్పాట్‌లోకి రాఘవేంద్ర రావు, జక్కన్న ఎంటర్ అవుతుండగా.. ఎన్టీఆర్ వాళ్లని రిసీవ్ చేసుకుంటున్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. హాట్ సీట్లో కూర్చుని వీరిద్దరితో యంగ్ టైగర్ ఎలా ఆటాడిస్తారోననే ఆసక్తి అందరిలోనూ క్రియేట్ అయ్యింది.

Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

రాజమౌళి దర్శకుడిగా తన ఫస్ట్ సినిమా ‘స్టూడెంట్ నెం.1’ ను తారక్ హీరోగా తన గురువు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో చేశారు. తర్వాత ఎన్టీఆర్ – జక్కన్న కలయికలో ‘సింహాద్రి’, ‘యమదొంగ’ సినిమాలు వచ్చాయి. ‘బాహుబలి’ రెండు భాగాలకు రాఘవేంద్ర రావు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు తారక్, చరణ్‌లతో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…