Rajamouli Oscar Success Party : ఆస్కార్ తర్వాత స్పెషల్ పార్టీ అరేంజ్ చేసిన రాజమౌళి.. పియానో వాయించిన కీరవాణి.. సందడి చేసిన RRR టీం..

గత కొన్ని నెలలుగా రాజమౌళి, RRR టీం అంతా అమెరికాలో ఉండి మన నాటు నాటు సాంగ్ ని, RRR సినిమాని ప్రమోట్ చేసి ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు సాధించారు. దీంతో RRR చిత్రయూనిట్, వాళ్ళ ఫ్యామిలీలు పట్టలేని ఆనందంలో మునిగిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి అమెరికాలో స్పెషల్ పార్టీ అరేంజ్ చేశాడు...............

Rajamouli Oscar Success Party : ఆస్కార్ తర్వాత స్పెషల్ పార్టీ అరేంజ్ చేసిన రాజమౌళి.. పియానో వాయించిన కీరవాణి.. సందడి చేసిన RRR టీం..

Rajamouli Arrange Oscar Success Party in America

Rajamouli Oscar Success Party :  ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా ముగిసాయి. పలు రకాల కేటగిరీలలో అనేక సినిమాలు ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి. మన ఇండియా నుంచి నామినేట్ అయిన వాటిల్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫాంట్ విష్పరర్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాయి.

గత కొన్ని నెలలుగా రాజమౌళి, RRR టీం అంతా అమెరికాలో ఉండి మన నాటు నాటు సాంగ్ ని, RRR సినిమాని ప్రమోట్ చేసి ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు సాధించారు. దీంతో RRR చిత్రయూనిట్, వాళ్ళ ఫ్యామిలీలు పట్టలేని ఆనందంలో మునిగిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి అమెరికాలో స్పెషల్ పార్టీ అరేంజ్ చేశాడు.

గత కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికా లాస్ ఏంజిల్స్ లోనే ఓ ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నాడు. నిన్న ఆస్కార్ సాధించాక ఆ ఇంటిని అందంగా డెకరేట్ చేశారు. ఎంట్రీలో నాటు నాటు అనే బెలూన్స్ తో వెల్కమ్ ఇచ్చారు. ఇంటి లోపల అందంగా డెకరేట్ చేశారు. RRR అనే బెలూన్స్ ని ఏర్పాటు చేశారు. ఇక ఇన్ని రోజులుగా RRR టీంకి వచ్చిన అవార్డులన్నీ ఒక టేబుల్ మీద ఏర్పాటు చేసి అన్నిటికంటే ఎత్తులో ఆస్కార్ అవార్డుని పెట్టారు. ఈ పార్టీకి చెందిన కొన్ని వీడియోలు, ఫోటోలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

Michelle Yeoh : ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి ఆసియన్ మహిళగా చరిత్ర సృష్టించిన Michelle Yeoh

ఇక ఈ పార్టీలో కీరవాణి పియానో వాయించి అందర్నీ మెప్పించారు. రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, శోభు యార్లగడ్డ.. మరికొంతమంది ఈ పార్టీలో పాల్గొన్నారు. ఆస్కార్ వచ్చిన ఆనందంలో RRR చిత్రయూనిట్, రాజమౌళి ఈ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇక నిన్నటి నుంచి రాజమౌళికి, కీరవాణి, చంద్రబోస్ లకు, RRR చిత్రయూనిట్ కి దేశ విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.