Rajamouli : రాజమౌళికి మరో గౌరవం.. చార్లీ చాప్లిన్ సినిమా ప్రదర్శనకు అతిధిగా..

తాజాగా రాజమౌళికి మరో గౌరవం దక్కింది. అమెరికన్ సినిమాథెక్ సండే ప్రింట్ ఎడిషన్ సిరీస్‌లో భాగంగా చార్లీ చాప్లిన్ సినిమాని ప్రదర్శించనున్నారు. 1931లో వచ్చిన.............

Rajamouli : రాజమౌళికి మరో గౌరవం.. చార్లీ చాప్లిన్ సినిమా ప్రదర్శనకు అతిధిగా..

Rajamouli as guest for Charlie Chapin Movie Screening

Rajamouli :  రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని అందరికి పరిచయం చేస్తే RRR సినిమాతో ఆ సతాయిని మరో మెట్టు ఎక్కించాడు. RRR సినిమా రిలీజ్ అయినా దగ్గర్నుంచి టాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా ప్రేక్షకులు, టెక్నీషియన్లు, ప్రముఖులు అంతా RRR సినిమాని అభినందిస్తున్నారు. హాలీవుడ్ లో, అమెరికాలో అయితే రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది.

కొన్ని రోజులుగా రాజమౌళి అమెరికాలోనే ఉండి పలు హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్స్ కి హాజరవుతున్నారు. అక్కడ RRR సినిమాని ప్రదర్శిస్తున్నారు. అక్కడి మీడియాతో, ప్రేక్షకులతో రాజమౌళి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి హాలీవుడ్ లో జరుగుతున్న బియాండ్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. బియాండ్ ఫిలిం ఫెస్టివల్ లో RRR మాత్రమే కాక రాజమౌళి గత సినిమాలని కూడా ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజమౌళికి మరో గౌరవం దక్కింది.

RRR: ఆస్కార్ బరిలో “RRR”.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్!

అమెరికన్ సినిమాథెక్ సండే ప్రింట్ ఎడిషన్ సిరీస్‌లో భాగంగా చార్లీ చాప్లిన్ సినిమాని ప్రదర్శించనున్నారు. 1931లో వచ్చిన చార్లీ చాప్లిన్ సూపర్ హిట్ సినిమా ‘సిటీ లైట్స్’ ని లాస్ ఏంజల్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే ఈ ప్రోగ్రాంకి రాజమౌళిని అతిధిగా ఆహ్వానించారు. రాజమౌళి చార్లీ చాప్లిన్ సినిమా ప్రదర్శన కార్యక్రమానికి అతిధిగా ఆహ్వానించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే RRR సినిమాని జనరల్ కేటగిరిలో ఆస్కార్ బరిలో నింపారు చిత్ర యూనిట్. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. దీంతో మరోసారి RRR ఆస్కార్ పై ఆశలు నెలకొన్నాయి.