Rajamouli : సినిమా నాకు దేవాలయం లాంటిది.. చిన్నప్పుడు సినిమా ఇచ్చిన ఆనందం ఇప్పటికి గుర్తుంది..

న్యూయార్క్‌ లో జరిగిన ఈ వేడుకకి భార్య, కుటుంబంతో కలిసి విచ్చేశాడు రాజమౌళి. ఈ ఈవెంట్ లో అవార్డు తీసుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. RRR సినిమాకి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచం అంతా ఉన్న భారతీయుల్ని ఊహించుకొని నేను...........

Rajamouli : సినిమా నాకు దేవాలయం లాంటిది.. చిన్నప్పుడు సినిమా ఇచ్చిన ఆనందం ఇప్పటికి గుర్తుంది..

Rajamouli comments on cinema at new york film critics award function

Rajamouli :  రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి అందరి మెప్పు పొందింది. హాలీవుడ్ లో అయితే ఈ సినిమాని, దర్శకుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. ఇక హాలీవుడ్ లో RRR సినిమా ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంటుంది. తాజాగా న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి RRR సినిమాకి అవార్డు అందుకున్నాడు.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మళ్ళీ మారిందా?

న్యూయార్క్‌ లో జరిగిన ఈ వేడుకకి భార్య, కుటుంబంతో కలిసి విచ్చేశాడు రాజమౌళి. ఈ ఈవెంట్ లో అవార్డు తీసుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. RRR సినిమాకి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచం అంతా ఉన్న భారతీయుల్ని ఊహించుకొని నేను సినిమాలు చేస్తాను. కానీ RRR సినిమాపై భారతీయులు ఎలాంటి ప్రేమని చూపించారో విదేశీయులు కూడా అలాంటి ప్రేమనే చూపించారు. చాలా వరకు నా సినిమాలకి పనిచేసే ముఖ్యమైన వ్యక్తులంతా నా కుటుంబ సభ్యులే ఉంటారు. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి వాళ్ళు నా కోసం కష్టపడుతూనే ఉంటారు. నేను ఎన్ని విజయాలు అందుకున్నా వాటన్నిటికీ నా కుటుంబానికి రుణపడి ఉంటాను. అలాగే RRR సినిమాకి చరణ్ కి, ఎన్టీఆర్ కి, చిత్ర యూనిట్ అందరికి, సినీ ప్రేమికులకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా దృష్టిలో సినిమా అనేది దేవాలయం లాంటిది. చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు ఉన్న ఆనందం ఇప్పటికి నాకు గుర్తుంది అంటూ తెలిపి సినిమాపై ఉన్న తన ప్రేమని తెలిపారు. దీంతో సినిమా నా దేవాలయం అనే వ్యాఖ్యలు హాలీవుడ్ లో చర్చగా మారాయి. ఈ విషయంలో రాజమౌళిని మరోసారి అభినందిస్తున్నారు.