Rajamouli : కాసేపట్లో జగన్‌ని కలవనున్న రాజమౌళి, దానయ్య.. ఈ మీటింగ్ ఎందుకో??

జీవో వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, దానయ్య జగన్ ని కలవనున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో వీరిద్దరూ ఏపీకి బయలుదేరారు. మరి కాసేపట్లో జగన్ ని కలవనున్నారు......

Rajamouli : కాసేపట్లో జగన్‌ని కలవనున్న రాజమౌళి, దానయ్య.. ఈ మీటింగ్ ఎందుకో??

Rajamouli

 

Rajamouli :  ఇటీవల ఏపీలో సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలతో పాటు అనేక సమస్యలని పరిష్కారించడానికి చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌ని, మంత్రి పేర్ని నాని ని కలిశారు. కొన్ని చర్చల అనంతరం సినీ పరిశ్రమకి సపోర్ట్ చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా ముందు సినిమా టికెట్స్‌ని ఓ మోస్తరుగా పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇందుకు కృతజ్ఞతగా సినీ పరిశ్రమ ప్రముఖులంతా జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు.

సినిమా టికెట్ రేట్లతో పాటు మరిన్ని సంస్కరణలతో ఈ కొత్త జీవోని ఇచ్చారు. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు కానీ అందులో 20 శాతం షూటింగ్ ఏపీలోనే చేసి ఉండాలని మెలిక పెట్టారు. ఈ జీవో వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, దానయ్య జగన్ ని కలవనున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో వీరిద్దరూ ఏపీకి బయలుదేరారు. మరి కాసేపట్లో జగన్ ని కలవనున్నారు.

Suma Kanakala : ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ సినిమాల మధ్యలో సుమక్క సినిమా

అయితే ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అంటూ ఆరాలు తీస్తున్నారు. ముందుగా టికెట్ రేట్లు పెంచినందుకు కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు రాజమౌళి, దానయ్య. అంతే కాక దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ మార్చ్ 25న విడుదల కానుంది. ఇప్పటికే తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చారు. కానీ ఏపీలో టికెట్ రేట్లు పెంచాలి అంటే ఉన్న కండిషన్ 20 శాతం షూటింగ్ ఏపీలో జరగాలి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అది జరగలేదు. అందుకే ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచమని అడిగేందుకు కలవనున్నారు.

Shree Rapaka : బిగ్‌బాస్‌ నుంచి ఆర్జీవీ భామ అవుట్..

ఇటీవల వచ్చిన పుష్ప, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయి. కలెక్షన్స్ కూడా భారీగానే సాధించాయి. కానీ ఏపీలో మాత్రం కలెక్షన్స్ తక్కువగానే ఉన్నాయి. దాని వల్ల మిగిలిన ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ లాభం పొందితే ఏపీలో మాత్రం సినిమా హిట్ అయినా నష్టాలనే చూశారు. దీంతో ఈ పరిస్థితి ‘ఆర్ఆర్ఆర్’కి రాకూడదని ముందుగానే డైరెక్ట్ గా వెళ్లి కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్ అడగనున్నారు. మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.