Rajamouli: ఫస్ట్ టైమ్ ఫ్యామిలీకి ఎలివేషన్ ఇచ్చిన జక్కన్న!

తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల..

Rajamouli: ఫస్ట్ టైమ్ ఫ్యామిలీకి ఎలివేషన్ ఇచ్చిన జక్కన్న!

Rajamouli

Rajamouli: తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఎవరంటే అన్ డౌటెడ్ గా రాజమౌళి అనే అంటారు అందరూ. బాహుబలితో వచ్చిన క్రేజ్ అక్కడే ఆగిపోకుండా ఇంకా ఇంకా తెలుగు సినిమాని ప్రమోట్ చేసేస్తున్నాడు. ఆయన సినిమాకే ఆయన కస్టపడి ప్రమోట్ చేసుకున్నా బయట అది ముందు తెలుగు సినిమాగానే ప్రమోట్ అవుతుంది.

Malavika Mohanan: బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలంటే కండిషన్ పెట్టిన మాళవికా!

రాజమౌళి సినిమాలో పనిచేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటే.. రాజమౌళి సినిమా వస్తుంది.. ఓ రెండు వారాలు మన సినిమాలు పక్కకి తప్పుకుంటే బెటర్ అని బాలీవుడ్ నిర్మాతలు కూడా చేతులెత్తేసే స్థాయికి రాజమౌళి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రాజమౌళి ఇంతటి స్థాయిలో విజయాలను అందుకున్నారంటే ఆ విజయం వెనుక ఆయన కుటుంబమే కనిపిస్తుంది. చిన్నా పెద్దా.. ఆడా మగా అని తేడా లేకుండా అందరూ ఆ సినిమా కోసం కష్టపడి దాన్ని తీరాలకి చేరుస్తారు.

Vijay Devarakonda: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

రాజమౌళి సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్. కథా రచయితగా పక్కా స్క్రిప్ట్ తో కథను సిద్ధం చేసి రాజమౌళి చేతిలో పెడతారు విజయేంద్ర ప్రసాద్. అయితే.. రాజమౌళి తనకి ఏం కావాలో తండ్రికి చెప్పడంలో దిట్ట. ఇంతవరకు అందరికీ తెలిసిందే కాగా కథా, స్క్రిప్ట్ లో మరో కంటికి కనిపించని హ్యాండ్ ఉంది. అదే ఎస్ఎస్ కాంచి. కాంచి రాజమౌళికి మరో అన్న. కథా, స్క్రిప్ట్ మీద ఆయనకున్న పట్టు గురించి ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా అంటే సంగీతం ఇచ్చేది ఒక్కరే.. ఆయనే రాజమౌళి పెద్దన్న కీరవాణి.

RGV: నా చిన్నప్పుడు పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకునేవాడిని.. వర్మ ట్వీట్!

కీరవాణి సంగీతం ఒక్కటే కాదు.. ప్రతి సీన్ రష్ కూడా కీరవాణి చూశాకే ఫైనల్ అయ్యేది. రాజమౌళికి వదిన.. కీరవాణి భార్య శ్రీవల్లి ప్రొడక్షన్ లో బాధ్యతలను సొంత మనిషికన్నా ఎక్కువగా చూసుకుంటుంది. రాజమౌళి భార్య రమా.. ప్రతి సినిమాకి కాస్త్యుమ్ డిజైనర్. కావాల్సిన ప్రతి సీన్ కి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో ఆమె అహర్నిశలు శ్రమించి ఒక రూపం తీసుకొస్తుంది. రాజమౌళి కుమారుడు కార్తికేయ.. తండ్రికి మించిన రాక్షసుడిగా పనిలో రాత్రి పగలు కష్టపడే మరో కీ రోల్. వీళ్ళే కాదు.. మరో సోదరుడు కళ్యాణ్ మాలిక్, సోదరి ఎంఎం శ్రీలేఖ, కీరవాణి కుమారుడు సింహ ఇలా రాజమౌళి సినిమా కోసం ఎవరు ఎంత చేయాలో అంతా చేస్తారు.

Telugu Films Release: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

ఇప్పటి వరకు రాజమౌళి తన సినిమాలలో ఫ్యామిలీ మెంబర్స్ కంట్రిబ్యూషన్ గురించి పెద్దగా ఎక్కడా చెప్పరు. కానీ, ఇప్పుడు తొలిసారి కుటుంబ సభ్యుల గురించి నేషనల్ మీడియా వద్ద భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ముంబైలో తన సినిమాలో తన కుటుంబ సభ్యుల సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. తొలిసారి అన్న కాంచి గురించి.. కుమారుడు కార్తికేయ తనను మించిన రాక్షసుడని.. వదిన శ్రీవల్లి, భార్య రమా, అన్న కీరవాణి ఎవరేం చేస్తారో పూసగుచ్చినట్లు చెప్పి ఎమోషనల్ అయ్యారు.