#RajamouliMakeRamayan : రాజమౌళి సర్..రామాయణం చేయండి..ట్రెండింగ్

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 12:46 AM IST
#RajamouliMakeRamayan : రాజమౌళి సర్..రామాయణం చేయండి..ట్రెండింగ్

భారీ సినిమాలు, గ్రాఫిక్స్ తో మాయాజాలం, అద్బుత వండర్ గా టాలీవుడ్ లో సినిమాలు తీర్చిదిద్దే దర్శకులు ఎవరు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి. ఆయన తీసిన సినిమాలే ఇందుకు నిదర్శనం. ఆసక్తకరమైన ట్విస్టులు, వండర్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈయన తీసే సినిమాలు అద్బుతం సృష్టిస్తున్నాయి. ఆయన తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు అంతర్జాతీయంగా ఎంత పేరు గడించాయో తెలిసిందే.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ కాంబినేషన్ లో RRR సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. కానీ…మరో సినిమా తీయాలని కోరుతున్నా ప్రేక్షకులు. ఇంతకీ దేనిపై సినిమా తీయాలని అనుకుంటున్నారో తెలుసా ? భారత ఇతిహాసాల్లో ఒకటైన రామయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు. 

వాల్మీకి రచించిన రామాయణం మహాకావ్యాన్ని గతంలో దర్శకులు సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే. త్రేతాయుగం నాటి అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు.. ఎన్టీరామారావును రాముడి రూపంలో చూసిన ఆశేష తెలుగు జాతి మురిసిపోయింది. శ్రీకృష్ణుడి పాత్రలో జననీరాజనం అందుకున్న రామారావు రాముడిగా కూడా అంతే మైమరపింపచేశారు. దీనిని సీరియల్స గా తెరకెక్కించారు దర్శకుడు రామానంద సాగర్. 1987లో ఈ సీరియల్ ప్రసారమైంది. 

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో బుల్లితెరపై మరోసారి రామాయణం సీరియల్ ప్రసారం చేస్తున్నారు. ఎక్కువ మంది వీక్షకులతో రికార్డు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా చేస్తున్న ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ‘రాజమౌళి సర్…రామాయణం చేయండి’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ను రాముడిగా చూడాలని అనుకుంటున్నామని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

వరుస ట్వీట్లతో #RajamouliMakeRamayan అనే హ్యాష్ ట్యాగ్ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. గతంలో తప్పకుండా మహాభారతం సినిమాను చేస్తానని చాలా సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.