Rajamouli : మొన్న స్టీవెన్ స్పిల్‌బర్గ్, నేడు జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి.. RRRని ప్రశంసిస్తున్న హాలీవుడ్ దిగ్గజాలు..

తాజాగా ప్రపంచంలో మరో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని రాజమౌళి కలిశారు. టైటానికి, అవతార్ లాంటి సినిమాల దర్శకుడిని రాజమౌళి కలవడమే కాదు ఆయన RRR సినిమా నచ్చిందని, తన భార్యకి కూడా చూడమని.........................

Rajamouli : మొన్న స్టీవెన్ స్పిల్‌బర్గ్, నేడు జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి.. RRRని ప్రశంసిస్తున్న హాలీవుడ్ దిగ్గజాలు..

Rajamouli mets james camaron

Rajamouli :  RRR సినిమాతో రాజమౌళి ప్రపంచమంతటా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి, దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, అవార్డులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ లో ఈ సినిమాని, రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. గత కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR సినిమాని ప్రమోట్ చేస్తూ ఆస్కార్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఇక ఇటీవలే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గెలుచుకున్నారు.

దీంతో మరోసారి హాలీవుడ్ చూపు RRR సినిమాపై పడింది. ఇప్పటివరకు చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు RRR సినిమాని అభినందించారు. అలాగే మరిన్ని హాలీవుడ్ అవార్డులని RRR సినిమా గెలుచుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్స్ ని వివిధ అవార్డు ఫంక్షన్స్ లో కలవగా వారు RRR సినిమాని, రాజమౌళిని అభినందిస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పిల్ బర్గ్ ని కలిశారు. ఆయన్ని కలిసిన రాజమౌళి ఆ ఫోటోని షేర్ చేస్తూ నా దేవుడ్ని కలిశారని పోస్ట్ చేశారు. స్టీవెన్ స్పిల్ బర్గ్ కి RRR సినిమా, నాటు నాటు సాంగ్ నచ్చాయని చెప్పారన్నారు. దీంతో వీరిద్దరి ఫోటో వైరల్ గా మారింది.

తాజాగా ప్రపంచంలో మరో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని రాజమౌళి కలిశారు. టైటానికి, అవతార్ లాంటి సినిమాల దర్శకుడిని రాజమౌళి కలవడమే కాదు ఆయన RRR సినిమా నచ్చిందని, తన భార్యకి కూడా చూడమని సజెస్ట్ చేశానని చెప్పడం విశేషం. జేమ్స్ కామెరూన్ తో ఉన్న ఫోటోని రాజమౌళి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. RRR సినిమా మీకు మాత్రమే నచ్చడం కాదు, మీ భార్యకి సజెస్ట్ చేసి మళ్ళీ ఆవిడతో కలిసి చూశారన్నారు. మీతో 10 నిముషాలు మాట్లాడుతూ మా సినిమా గురించి అనలైజ్ చేయడం నమ్మలేకపోతున్నాను. నన్ను వరల్డ్ లో టాప్ అన్నందుకు థ్యాంక్ యు సర్ అని పోస్ట్ చేశారు.

Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..

అలాగే కీరవాణి కూడా జేమ్స్ కామెరూన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. RRR సినిమాని చూసి నా మ్యూజిక్ కూడా నచ్చిందని చెప్పారు. సముద్రమంత ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశారు. ఇలా హాలీవుడ్ లో రాజమౌళి రోజురోజుకి మరింత పేరు సంపాదించడంతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి వరల్డ్ టాప్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే ఊపులో RRR కి ఆస్కార్ రావాలని అంతా కోరుకుంటున్నారు.