RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

విడుదలకు రెండు నెలలే ఉన్న ట్రిపుల్ ఆర్.. ప్రమోషన్ల విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ క్లాసిక్ మూవీకి సంబందించి మాస్ సాంగ్ తో ప్రమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు రాజమౌళి.

RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

Rrr

RRR: విడుదలకు రెండు నెలలే ఉన్న ట్రిపుల్ ఆర్.. ప్రమోషన్ల విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ క్లాసిక్ మూవీకి సంబందించి మాస్ సాంగ్ తో ప్రమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు రాజమౌళి. జస్ట్ ప్రోమోతోనే సినిమా మీద హైప్ పెంచిన రాజమౌళి.. బోనస్ గా డైలాగ్ కూడా రివీల్ చేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ఏ చిన్న ఛాన్స్ నీ మిస్ కానివ్వని రాజమౌళి.. నాటు ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబందించి చిన్న పోస్టర్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే.. ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా దించడంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ రేంజ్ కి తగినట్టే ప్రమోషన్లు చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. లేటెస్ట్ గా ఈసినిమాకు సంబందించి రెండో పాట ప్రోమోని రిలీజ్ చేసింది టీమ్.

Sankranti 2022: భీమ్లా కూడా విత్ డ్రా?.. వార్ వన్ సైడ్ అవుతుందా?

కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ల మధ్య ఎమోషనల్ డ్రామా ఉంటుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ రాజమౌళి వీళ్లిద్దరికీ కలిపి క్రేజీ సాంగ్ డిజైన్ చేశారు. నాటు.. ఊరనాటు అంటూ స్టార్ హీరోలిద్దరూ అంతకంటే ఊరమాస్ స్టెప్పులేస్తుంటే.. అబ్బో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జస్ట్ సాంగ్ ప్రోమోతోనే ఇంత హడావిడి, హైప్ తెచ్చిన రాజమౌళి.. ఫుల్ సాంగ్ కి మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చెయ్యాలంటున్నారు.

Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

ఒక పక్క సాంగ్స్, వీడియోలతో సినిమా మీద రోజురోజుకీ ఇంట్రస్ట్ పెంచేస్తున్న రాజమౌళి.. ఈ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ తో సినిమా మీద హైప్ ని మరో మెట్టు ఎక్కించారు. నువ్వు చేసేది ధర్మయుద్దం అయితే ఆయుధాలు వాటంతట అవే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తాయంటూ.. రాజమౌళి రిలీజ్ చేసిన డైలాగ్ సినిమాలో ఇంటెన్సిటీని చూపిస్తోంది.

RRR Glimpse : గోండు బెబ్బులి గోళ్లు ఆ సినిమా నుండి తీసుకున్నారా?

అటు హీరోలు, ఇటు రాజమౌళే కాదు.. ట్రిపుల్ ఆర్ టీమ్ అయితే అసలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఫ్యాన్స్ ఏ టైమ్ లో ట్వీట్లు పెట్టినా వెంటనే రిప్లై ఇస్తోంది ట్రిపుల్ ఆర్ టీమ్. అంతేకాదు ఫ్యాన్స్ ట్వీట్లకు కౌంటర్లతో పాటు క్రేజీ మీమ్స్, జిఫ్ లతో ట్రిపుల్ ఆర్ టీమ్ ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్ గా నాటు సాంగ్ రెస్పాన్స్ కి సంబందించి ఓ కామెడీ వీడియోని పోస్ట్ చేసి ఫుల్ సాంగ్ తో బాక్సులు బద్దలే, క్రేజీగా రిప్లై ఇచ్చింది.