Rajamouli : జక్కన్న మరో మల్టీస్టారర్..!

మహేష్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నారట..

Rajamouli : జక్కన్న మరో మల్టీస్టారర్..!

Rajamouli

Rajamouli: ‘స్టూడెంట్ నెం.1’ నుండి ‘బాహుబలి’ వరకు బాక్సాఫీస్ బరిలో తిరుగులేని దర్శకధీరుడిగా విజయకేతనం ఎగురవేస్తున్నారు రాజమౌళి. తెలుగు సినిమా సత్తాని ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్‌తో ప్రపంచానికి చాటి చెప్పారు. జక్కన్న ‘బాహుబలి: ది బిగినింగ్’ లో ఇచ్చిన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ట్విస్టుతో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ కోసం వరల్డ్ వైడ్‌‌గా వెయిట్ చేశారు.

Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

ఇప్పుడు అంతకంటే ఈగర్‌గా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎదురు చూస్తున్నారు. మేకింగ్‌కి ఎక్కువ టైం తీసుకున్నా కానీ అవుట్‌పుట్ మాత్రం అదిరిపోతుంది. ‘మగధీర’ తో సీజీ వంటి టెక్నికల్ వాల్యూస్ యాడ్ చేసి ‘బాహబలి’ సిరీస్‌ని విజువల్ వండర్‌గా క్రియేట్ చేసి హాలీవుడ్‌కి టాలీవుడ్ ఏమాత్రం తక్కువ కాదు అని ప్రూవ్ చేశారు.

RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యబోతున్నారు జక్కన్న. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సూపర్ హీరో రేంజ్‌లో కథ రెడీ చేస్తున్నారు రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లానే ఈ సినిమాను కూడా మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుంది.

RRR – Saaho : ‘సాహో’ను దాటేసిన ‘ఆర్ఆర్ఆర్’..!