Memu Famous : మేము ఫేమస్ సినిమాపై.. మహేష్, రాజమౌళి ట్వీట్లు.. స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్స్.. అసలు ఏముంది ఆ సినిమాలో?

సినిమాకు ఒక్క రోజు రిలీజ్ కి ముందు మహేష్ బాబు సినిమా అదిరిపోయింది అంటూ ట్వీట్ చేస్తూ, ఈ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గా చేసిన సుమంత్ ప్రభాస్ కి ఏకంగా తన నిర్మాణంలో నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేశాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా రాజమౌళి కూడా ఈ సినిమాని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

Memu Famous : మేము ఫేమస్ సినిమాపై.. మహేష్, రాజమౌళి ట్వీట్లు.. స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్స్.. అసలు ఏముంది ఆ సినిమాలో?

Rajamouli special tweet on memu famous movie

Rajamouli : యూట్యూబ్(Youtube) లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్(Memu Famous). చాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 30 మంది కొత్త నటీనటులు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ మాత్రం భారీగా, డిఫరెంట్ గా చేశారు. సినిమా రిలీజ్ కి ముందు నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేశారు. నాని, నాగచైతన్య, రానా, అడివి శేష్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, సుమ, మంగ్లీ… వీళ్ళే కాకుండా పలువురు టీవీ, సినీ సెలబ్రిటీలు ఈ సినిమా ప్రమోషన్స్ చేశారు.

ఇటీవల మే 26న మేము ఫేమస్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సందడి చేస్తుంది. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి. మూడు రోజుల్లో 3.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కేవలం 2 కోట్లతో తీసిన ఈ సినిమాకు ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభినందిస్తూ ట్వీట్స్ వేస్తున్నారు.

సినిమాకు ఒక్క రోజు రిలీజ్ కి ముందు మహేష్ బాబు సినిమా అదిరిపోయింది అంటూ ట్వీట్ చేస్తూ, ఈ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గా చేసిన సుమంత్ ప్రభాస్ కి ఏకంగా తన నిర్మాణంలో నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేశాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా రాజమౌళి కూడా ఈ సినిమాని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. రాజమౌళి తన ట్వీట్ లో.. చాలా రోజుల తర్వాత ఒక సినిమాని థియేటర్ లో ఎంజాయ్ చేశాను. ఈ అబ్బాయి సుమంత్ కి హీరోగా, డైరెక్టర్ గా మంచి భవిష్యత్తు ఉంది. సినిమాలో నటించిన వాళ్లంతా చాలా న్యాచురల్ గా నటించారు. ముఖ్యంగా అంజిమామ క్యారెక్టర్. అందరూ ఈ సినిమాని చూడాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. చివర్లో ఈ సినిమాలోని డైలాగ్.. యూత్ ని ఎంకరేజ్ చేయాలె. దమ్ దమ్ చెయ్యొద్దు అని తన ట్వీట్ లో రాశారు.

Rana Daggubati : రానా ‘మానాడు’ రీమేక్ కన్‌ఫార్మ్.. కానీ తెలుగులో కాదు!

దీంతో మహేష్, రాజమౌళి ట్వీట్స్ వేసేంత ఆ సినిమాలో ఏముంది? స్టార్ సెలబ్రిటీలు సైతం ప్రమోషన్స్ కి వచ్చేంత ఆ సినిమాలో ఏముంది అని ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. సినిమా కథ విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో ఖాళీగా పనిపాట లేకుండా తిరిగే ఓ ముగ్గురు యువకులు ఎలా రియలైజ్ అయ్యారు? ఎలా సక్సెస్ అయ్యారు? రియలైజ్ అయి పని చేసుకునే సమయంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ యువకుల లవ్ స్టోరీ, ఊర్లో వాళ్ళు చేసే కామెడీ.. ఇలా ఓ పల్లెటూళ్ళో కామెడీ, లవ్, ఎమోషన్స్ తో తెరకెక్కించిన సినిమా మేము ఫేమస్. ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ తెలంగాణ నేటివిటీ తీసుకోవడం, సినిమా అంతా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడం వల్ల ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇక టికెట్ రేట్లు కూడా అన్ని సినిమాలలాగా కాకుండా తగ్గించడంతో మరింతమంది ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు.