Bhala Thandanana: శ్రీవిష్ణుకు జక్కన్న సపోర్ట్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, వెరైటీ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ.. సినిమా సినిమాకీ నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. ఇప్పుడు మరో క్రేజీ ఫిలింతో రాబోతున్నాడు.

Bhala Thandanana: శ్రీవిష్ణుకు జక్కన్న సపోర్ట్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

Bhala Thandanana

Bhala Thandanana: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, వెరైటీ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ.. సినిమా సినిమాకీ నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. ఇప్పుడు మరో క్రేజీ ఫిలింతో రాబోతున్నాడు. శ్రీ విష్ణు, కేథ‌రిన్ థ్రెసా కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం భ‌ళా తంద‌నాన. బాణం ఫేమ్ చైత‌న్య దంతులూరి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మే 6న విడుద‌ల కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

Bhala Thandanana: ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్.. భళా తందనాన ట్రైలర్

ప్రమోషన్లలో భాగంగా హైద‌రాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో ఈరోజు మంగళవారం సాయంత్రం 7 గంట‌లకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై క్రేజ్ మొదలైంది. రాజమౌళి లాంటి స్టార్ దర్శకుడు ఈ సినిమాకి సపోర్ట్ చేయడంతో శ్రీవిష్ణు ఈసారైనా బ్లాక్ బస్టర్ కొడతాడా అనే చర్చ మొదలైంది. అయితే.. ఈ వేడుకకు రాజమౌళి హాజరవడం వెనుక ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలే కారణం.

Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి భ‌ళా తంద‌నాన సినిమాను నిర్మిస్తున్నారు. వారాహీ బ్యానర్ అంటే రాజమౌళి హోమ్ బ్యానర్ లెక్కే. ఒకరకంగా రాజమౌళి అండతోనే సాయి కొర్రపాటి డిస్టిబ్యూటర్ నుండి నిర్మాతగా మారారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా డిస్టిబ్యూషన్ వెనుక సాయి కొర్రపాటి ప్లాన్స్, సన్నాహాలు ఉన్నాయని చెప్పుకుంటారు. అందుకే భళా తందనాన సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతను రాజమౌళి తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైతేనేం జక్కన్న రాకతో అయినా శ్రీవిష్ణు లాంటి హీరోకు ఒక్క హిట్టు పడితే చాలు.