Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి.....

Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!

Rajamouli To Take 3 Years For Mahesh Babu Movie

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో కలిసి జక్కన్న చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమా కోసం అప్పుడే పనులు మొదలుపెట్టాడు ఈ స్టార్ డైరెక్టర్.

Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేసిన జక్కన్న, ఇప్పుడు ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. మహేష్‌తో తాను చేయబోయే సినిమా అడ్వెంచరస్ మూవీగా రాబోతుందని, ఇలాంటి సినిమాను ఇప్పటివరకు ఇండియన్ ప్రేక్షకులు చూడలేదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఇప్పటికే ఫ్రాన్స్‌లోని ఓ పేరుమోసిన కంపెనీతో చర్చలు కూడా జరిపాడట. మహేష్ కోసం రాజమౌళి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చిందని అభిమానులు అంటున్నారు.

Rajamouli: ఇప్పటివరకు రాజమౌళి ఒక్కడే!

అయితే ఈ సినిమా కోసం మహేష్ లుక్స్ పరంగా కూడా చాలా మార్పులు చేస్తాడట. ఇక ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా అన్నీ పూర్తి కావాలంటే కనీసం మూడేళ్ల సమయం పడుతుందని జక్కన్న ముందే క్లారిటీగా ఉన్నాడట. అంటే.. మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలేదన్నా మూడేళ్లు ఆగాల్సిందేనని చిత్ర వర్గాలు అంటున్నాయి. మొత్తానికి మహేష్ కోసం జక్కన్న ఈసారి మూడేళ్లు లెక్క చెబుతుండటంతో, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వారు అసక్తిగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.