Sivani: రాజశేఖర్ పెద్దమ్మాయికి లక్కీ ఛాన్స్

సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్న తమిళ సినిమాలో శివానీ న‌టించ‌నున్నారు. బోనీ కపూర్ నిర్మాణంలో అరుణ్‌రాజ కామ రాజ్‌ దర్శకత్వం వహించనున్నారు.

Sivani: రాజశేఖర్ పెద్దమ్మాయికి లక్కీ ఛాన్స్

Sivani

Sivani: నటుడు రాజ‌శేఖ‌ర్‌, జీవితల కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ కోలీవుడ్‌లో ల‌క్కీచాన్స్ కొట్టేసింది. తమిళనాడు రాష్ట్ర తాజా సీఎం స్టాలిన్ కొడుకు ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుళ్లు. శివానీ చెల్లెలు శివాత్మిక‌. శివాత్మిక ముందుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. దొరసాని సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు శివాత్మిక పరిచయం అయ్యారు. చెల్లెలి కంటే లేట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా వరుస ప్రాజెక్టులు కొట్టేశారు.

శివానీ 2 స్టేట్స్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ప్ర‌స్తుతం గుహన్‌ దర్శకత్వంలో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమాలో అదిత్‌ అరుణ్ సరసన చేస్తున్నారు. ఈ ఫస్ట్‌ లుక్ కూడా విడుదలైంది. కాకపోతే కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది.

అలాగే ‘ఓ బేబి’ఫేం తేజ సజ్జతో మరో మూవీకి శివానీ సంతకం చేసేశారు. కోలీవుడ్‌లో ఓ క్రేజీ సినిమా చేసేందుకు, అందులోనూ సీఎం కొడుకు, యువ ఎమ్మెల్యే ఉద‌య‌నిధి స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం రావ‌డం ఎంతో అదృష్టం అని చిత్ర‌ప‌రిశ్ర‌మ చెబుతోంది.

హిందీ సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్న తమిళ సినిమాలో శివానీ న‌టించ‌నున్నారు. బోనీ కపూర్ నిర్మాణంలో అరుణ్‌రాజ కామ రాజ్‌ దర్శకత్వం వహించనున్నారు.