Rajasekhar: ‘మాన్‌స్టర్’గా వస్తున్న యాంగ్రీ స్టార్!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అదిరిపోయే రీతిలో స్టార్ట్ చేశారు. తాజాగా తన కెరీర్‌లోని 92వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజశేఖర్ రెడీ అయ్యాడు. దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని గతంలోనే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Rajasekhar: ‘మాన్‌స్టర్’గా వస్తున్న యాంగ్రీ స్టార్!

Rajasekhar New Movie Launched Officially

Rajasekhar: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అదిరిపోయే రీతిలో స్టార్ట్ చేశారు. ఆ సినిమా తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అయితే తాజాగా తన కెరీర్‌లోని 92వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజశేఖర్ రెడీ అయ్యాడు. దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని గతంలోనే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Rajasekhar : జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు.. మోసం చేశారంటూ నిర్మాత వ్యాఖ్యలు..

కాగా, తాజాగా రాజశేఖర్ కెరీర్‌లోని 92వ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లోనే టైటిల్‌ను ఆడియెన్స్ డీకోడ్ చేయాలంటూ వారికి ఓ పజిల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు మాన్‌స్టర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..

ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పవన్ సాదినేని తెరకెక్కించనుండగా, గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మల్కాపురం శివ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటుల, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.