యాంగ్రీ స్టార్ కల్కి టీజర్

రాజశేఖర్ బర్త్‌డే సందర్భంగా కల్కి టీజర్ విడుదల.

  • Published By: sekhar ,Published On : February 4, 2019 / 07:23 AM IST
యాంగ్రీ స్టార్ కల్కి టీజర్

రాజశేఖర్ బర్త్‌డే సందర్భంగా కల్కి టీజర్ విడుదల.

చాలాకాలం తర్వాత, గరుడవేగ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు, డా.రాజశేఖర్. ప్రస్తుతం.. అ! సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి మూవీ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా, కల్కి ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఫిబ్రవరి 4 న రాజశేఖర్ బర్త్‌డే సందర్భంగా కల్కి టీజర్ విడుదల చేసింది. 35 సెకన్ల నిడివిగల కల్కి టీజర్‌లో, రాజశేఖర్ యాంగ్రీనెస్ ఏ రేంజులో ఉండబోతుందో చూపించారు. రాజశేఖర్‌కి ఇంతకుముందు యాంగ్రీ యంగ్ మెన్ అనే బిరుదు ఉండేది..

ఈ సినిమా నుండి ఆ బిరుదు యాంగ్రీ స్టార్‌గా మారింది. 1980 తెలంగాణా బ్యాక్ డ్రాప్‌లో కల్కి రూపొందుతుంది. టీజర్‌కి శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఆర్ఆర్ హైలెట్ అయ్యింది. హ్యాపీ మూవీస్, శివాని, శివాత్మిక మూవీస్ బ్యానర్స్‌పై, సి.కళ్యాణ్ అండ్ రాజశేఖర్ కూతుళ్ళు శివాని, శివాత్మిక నిర్మిస్తున్నారు. మే నెలలో కల్కి రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి కెమెరా : దాశరథి శివేంద్ర, ఎడిటింగ్ : గౌతమ్ నెరుసు, లిరిక్స్ : కృష్ణకాంత్, సంగీతం : శ్రావణ్ భరద్వాజ్..

వాచ్ టీజర్…