Rajashekar : డెత్ బెడ్ నుంచి తిరిగొచ్చి సినిమా చేశాను.. మీ ఆశీర్వాదం వల్లే బతికి ఉన్నా.. సినిమాని కూడా బతికించండి..

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ''ఈ ఫంక్షన్ కు సుకుమార్, సముద్ర ఖని గార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చిన అందరికీ..................

Rajashekar : డెత్ బెడ్ నుంచి తిరిగొచ్చి సినిమా చేశాను.. మీ ఆశీర్వాదం వల్లే బతికి ఉన్నా.. సినిమాని కూడా బతికించండి..

Rajasekhar

Rajashekar :   రాజశేఖర్ హీరోగా, శివాని ముఖ్యపాత్రలో తెరకెక్కిన సినిమా శేఖర్. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘జోసెఫ్’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. శేఖర్ సినిమా మే 20న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు.

Sukumar : చిన్నప్పుడు రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి ఫేమస్ అయ్యాను..

 

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ”ఈ ఫంక్షన్ కు సుకుమార్, సముద్ర ఖని గార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. కోవిడ్ కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డానని మీ అందరికి తెలుసు. డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును కూడా మళ్లీ బతికించండి. మే 20న వస్తున్న ఈ సినిమాను మీరందరూ థియేటర్ కు వచ్చి చూడండి. మా సినిమా నచ్చితేనే పదిమందికి చెప్పండి. అప్పుడే మాతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఈ సినిమా కోసం  నాకంటే కూడా జీవిత చాలా కష్టపడింది. సినిమా చూస్తే అది మీకే తెలుస్తుంది. మా ఇద్దరు కూతుర్లు కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో జీవితకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకు ఇంత పేరు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం అనూప్. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సపోర్ట్ తో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది” అన్నారు.