Rajashekar : విలన్‌గా చేయడానికి నేను రెడీ : రాజశేఖర్

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ.. ''విలన్ రోల్స్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. నాక్కూడా విలన్ రోల్స్ చేయాలనే ఉంది. తెరపై నన్ను నేను విలన్ గా........

Rajashekar :  విలన్‌గా చేయడానికి నేను రెడీ : రాజశేఖర్

Rajashekar

Rakashekar :  హీరో రాజశేఖర్ ప్రస్తుతం తన 91వ సినిమా శేఖర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మలయాళం సినిమా ‘జోసెఫ్’కి రీమేక్ గా శేఖర్ ని తెరకెక్కించారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించింది. రాజశేఖర్ కూతురు శివాని ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా. ఈ సినిమాని రాజశేఖర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 4న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం వరుస టీవీ షోలకి, ఇంటర్వ్యూలకి హాజరవుతూ సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు.

Hero : మహేష్ మేనల్లుడి కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ.. ”విలన్ రోల్స్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. నాక్కూడా విలన్ రోల్స్ చేయాలనే ఉంది. తెరపై నన్ను నేను విలన్ గా చూసుకోవాలనే ఉంది. మంచి పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసమే వెయిట్ చేస్తున్నాను. గతంలో ‘ధృవ’ సినిమాలో విలన్ రోల్ కోసం వెతుకుతున్నారని తెలిసి అల్లు అరవింద్ గారిని అడగడం కూడా జరిగింది. ఆ పాత్రకి నేను సెట్ అవుతానని నాకు అనిపించింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు కూడా అలాంటి ఒక విలన్ రోల్ వస్తే చేయాలనే చూస్తున్నాను. మరి ఎప్పుడు వస్తుందో.. ఎవరు ఇస్తారో చూడాలి.” అని అన్నారు.