Annaatthe : ఫైనల్ షెడ్యూల్‌లో సూపర్‌స్టార్ సినిమా..

ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో ‘అన్నాత్తే’ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు టీమ్..

Annaatthe : ఫైనల్ షెడ్యూల్‌లో సూపర్‌స్టార్ సినిమా..

Rajinikanth

Annaatthe: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది టీం. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4 న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు.

Rajinikanth : సూపర్‌స్టార్ సిక్ అయ్యారు.. అమెరికా ఆసుపత్రిలో రజినీకాంత్..

పాండమిక్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇటీవల రెగ్యులర్ చెకప్ కోసం రజినీ కాంత్ అమెరికాకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో ‘అన్నాత్తే’ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు టీమ్. ప్రస్తుతం లక్నోలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. తర్వాత కలకత్తాకు షిఫ్ట్ అవబోతున్నారు రజినీ.

Rajinikanth : అమెరికాలో అభిమానులతో రజినీకాంత్.. పిక్స్ వైరల్..

ఈ నెల 21 నుండి ‘అన్నాత్తే’ కలకత్తా షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. దీంతో ఆల్ మోస్ట్ షూటింగ్ పూర్తవుతుంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, కీర్తి సురేష్, కమెడియన్లు సూర్య, సతీష్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Annaatthe Deepavali : తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా ‘అన్నాత్తే’..